రఘురామ కృష్ణం రాజు పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన ఎంపీ మిథున్ రెడ్డి..!!
TeluguStop.com
రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ గురించి ఎంపీ మిథున్ రెడ్డి తో పాటు వైసీపీ ఎంపీలు మీడియా సమావేశం నిర్వహించి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.
అప్పట్లో వైఎస్ జగన్ పై కేసులు వేయించడానికి శంకర్రావును ఏ రీతిగా వాడుకొన్నారో అదేరీతిలో రఘురామకృష్ణంరాజు ని చంద్రబాబు ప్రస్తుతం వాడుకుంటున్నారు అంటూ ఆరోపణలు చేశారు.
గతంలో టీడీపీ పార్టీకి చెందిన నాయకులు అరెస్ట్ అయిన సమయంలో ఎటువంటి రాద్ధాంతం చేయని చంద్రబాబు రఘురామకృష్ణంరాజు విషయంలో.
అనేకమంది ప్రభుత్వ పెద్దలకు లెటర్ రాయడం వెనకాల కుట్ర దాగి ఉందని ఎంపీ మిధున్ రెడ్డి పేర్కొన్నారు.
రఘురామకృష్ణంరాజు నోరు విప్పితే వీళ్ళ బండారం బయటపడుతుంది అన్న భయంతో చంద్రబాబు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రయత్నాలు స్టార్ట్ చేశారని తెలిపారు.
రఘురామ కృష్ణంరాజు ని సీఎం జగన్ అన్ని విధాలుగా సపోర్ట్ చేయడం జరిగిందని, అయినా ప్రభుత్వంపై రఘురామకృష్ణంరాజు కుట్రలు చేస్తున్నారని ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రమేష్ హాస్పిటల్ లో చికిత్స చేయించాలి పదే పదే కోరడం వెనకాల కుట్ర ఉందని.
మిధున్ రెడ్డి తెలిపారు.అదే రీతిలో రఘురామకృష్ణం రాజు కి ప్రాణహాని ఉందని.
సరికొత్త వ్యాఖ్యలు చేయటం వెనకాల.మొత్తం కుట్రను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎంపీ మిథున్ రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు.