లడ్డూ వివాదం : పవన్ కు వైసీపీ ఎంపీ ప్రశ్నలు 

తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) చేసిన సంచలన ప్రకటనతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కలకాలం రేగిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంలో గత వైసిపి పెద్దలను టార్గెట్ చేసుకుని టిడిపి ,జనసేన ,బిజెపిలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో, ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి లడ్డు( Tirumala Laddu ) ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనెలను వాడారని టిడిపి అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలకు సంబంధించి ఎటువంటి సాక్షాదారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

స్వచ్ఛమైన నెయ్యికి  బదులుగా జంతువుల కొవ్వును వినియోగించి గత వైసిపి ప్రభుత్వం అపవిత్రం చేసిందంటూ చంద్రబాబు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ విషయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తీవ్రంగానే స్పందించడంతో పాటు,  ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు.

"""/" / వైసిపి ప్రభుత్వం చేసిన తప్పులకు తాను ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటూ దీక్ష చేపట్టారు.

దీనిలో భాగంగానే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడిమెట్లను పవన్ స్వయంగా శుభ్రపరిచారు.ఇంకో రెండు రోజుల్లో ఈ దీక్ష ముగియాల్సి ఉన్న నేపథ్యంలో పవన్ ను టార్గెట్ చేసుకుని వైసిపి విమర్శలు చేస్తోంది.

చంద్రబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని,  బిజెపి ఎంపీ సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు( Supreme Court ) కల్తీ జరిగింది అందానికి ఎలాంటి సాక్షాదారాలు లేవని తేల్చింది.

  చంద్రబాబు ఆ ప్రకటన చేయడాన్ని తప్పు పట్టింది.రాజకీయాలకు కనీసం దేవుళ్ళనైనా దూరంగా పెట్టాలంటూ హితవు పలికింది.

తాజాగా ఈ వ్యవహారంపై తిరుపతి వైసీపీ ఎంపీ డాక్టర్ మద్దిళ్ళ గురుమూర్తి( MP Maddila Gurumurthy ) స్పందించారు.

"""/" / దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ కు కొన్ని ప్రశ్నలు సంధించారు.

పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు తేల్చిందని,  రాజకీయాల్లోకి దేవుళ్ళను లాగొద్దని చంద్రబాబుకు సుప్రీంకోర్టు హితవు పలికిందని గురుమూర్తి గుర్తు చేశారు.

అటువంటి అప్పుడు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష అవసరమా అని గురుమూర్తి ప్రశ్నించారు.అసలు కల్తీనే జరగనప్పుడు దీక్ష గాని , తిరుపతిలో బహిరంగ సభను గాని నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలు కించపరిచినట్లు అవుతుందని గురుమూర్తి హితవు  పలికారు.

 అంతేకాదు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణలో ఉన్న దశలో ఒక బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ పవన్ ప్రాయశ్చిత్త దీక్ష ఎలా చేయగలుగుతారని గురుమూర్తి ప్రశ్నించారు.

హిట్3 సినిమాతో నాని ఆ రికార్డును క్రియేట్ చేస్తారా.. ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా?