చంద్రబాబుపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ట్వీట్

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

2024 ఎన్నికల్లో చంద్రబాబుకు(Chandrababu) కేవలం నాలుగు స్థానాలే వస్తాయని తెలిపారు.వచ్చే నెల 4న జరిగే కౌంటింగ్ లో టీడీపీ(TDP) గెలిచేది నాలుగు స్థానాలేనని విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)పేర్కొన్నారు.

2014 లో చంద్రబాబు 23 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలను కొన్నారన్న ఆయన 2019 ఎన్నికల్లో నీకు వచ్చింది 23 స్థానాలేనని గుర్తు చేశారు.

ఈ క్రమంలోనే ఈసారి తమ పార్టీకి చెందిన నలుగురిని కొన్నావు.ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నారో ఇప్పటికే అర్థం అయి ఉంటుంది కదా చంద్రబాబు(Vijayasai Reddy) అంటూ విమర్శించారు.

ఈ నేపథ్యంలో నాలుగు సీట్లకే పరిమితం కాబోతున్నావని తెలిసి నీ మీద జాలేస్తుందని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు.

విజయ్, త్రిష మధ్య ఏదో నడుస్తోందా.. సోషల్ మీడియా వైరల్ వార్తల్లో నిజమెంత?