జమిలి ఎన్నికలపై వైసీపీ ఎంపీ బెలాన్ల చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు..!!
TeluguStop.com

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై భారీ ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.కేంద్రం ఇప్పటికే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ వేయడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.


ఈ క్రమంలో జమిలి ఎన్నికలపై వైసీపీ ఎంపీ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


తాజా పరిస్థితులు బట్టి దేశంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయని పేర్కొన్నారు.
ఈనెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటరీ సమావేశాలు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు.
జమిలి ఎన్నికలకు వెళ్లే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.
"""/" /
ఈ క్రమంలో జమిలి ఎన్నికలను దేశంలో చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు.
అయినా సరే ముందస్తు ఎన్నికలకు రెడీ గానే ఉండాలని వైసీపీ నేతలకు ఎంపీ చంద్రశేఖర్ సూచించారు.
ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలని కోరారు.
గత ఎన్నికల కంటే ఈసారి జరగబోయే ఎన్నికలలో ఎక్కువ మెజార్టీతో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని వ్యాఖ్యానించారు.
పెళ్లి ఫోటోలను డిలీట్ చేసిన ప్రముఖ స్టార్ సింగర్.. డిలీట్ చేయడానికి కారణాలివేనా?