వైసీపీలో అంతర్గత ఆధిపత్య పోరు! పట్టు కోసం సిగపట్లు

ఏపీలో అధికార పార్టీ వైసీపీ పాలన మొదలెట్టి ఇంకా ఏడాది కూడా పూర్తికానే లేదు అప్పుడే ఆ పార్టీలో కొన్ని నియోజకవర్గాలు, జిల్లాలలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది.

అలాగే కార్యకర్తలు కూడా కొన్ని పథకాల విషయంలో వర్గాలుగా విడిపోయి కొట్టుకునేంత వరకు వెళ్తున్నారు.

మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపధ్యంలో ఇప్పుడు ఈ అంతర్గత ఆధిపత్య పోరు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి.

కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే రోజా, మంత్రి పెద్దిరెడ్డి మధ్య వరం మీడియాలో హల్చల్ చేసింది.

రోజా నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో వైసీపీ కార్తకర్తలు ఎవరు పాల్గొనకూడదని ఆమె హుకుం జారీ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఆ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి వెళ్ళడం సంచలనంగా మారింది.ఇదిలా ఉంటే ఇప్పుడు కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య కోల్డ్‌వార్ నడుస్తుంది.

తనకు చెప్పకుండా పార్టీలో చేర్చుకోవడంపై హఫీజ్‌ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల ముందు తర్వాతా తనను ఎస్వీ మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టారని మీడియా ముఖంగా అన్నారు.

ఎస్వీ మోహన్ రెడ్డి తన కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.

సరైన టైమ్‌లో నిర్ణయం తీసుకుంటారు.రాజకీయాల నుంచైనా తప్పుకుంటా పార్టీకి చెడ్డపేరు తీసుకురాను అని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నియోజకవర్గంలో ఓ గ్రామంలో వైసీపీ కార్యకర్తలు సచివాలయం నిర్మాణం విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి ఎమ్మెల్యే ముందే కొట్టుకునేంత వరకు వెళ్ళారు.

ఈ పరిణామాలు అన్ని వైసీపీ పార్టీకి తలనొప్పిగా మారాయని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.