చంద్రబాబు భార్య కాళ్ళు కన్నీటితో కడుగుతాం వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఒకరోజు ఒక విధంగా మారుతున్నాయి.ప్రస్తుతం వరదలు చుట్టూ జరుగుతున్న రాజకీయాలు అంతకు ముందు చంద్రబాబు నాయుడు మీడియా ముందు ఏడుపు చుట్టూ తిరిగాయి.
అసెంబ్లీలో వైసీపీ పార్టీ నాయకులు తన భార్యపై దారుణంగా వ్యాఖ్యలు చేశారని.ఆమెకు అసలు రాజకీయాలు తెలియవు ఇంటి నుండి బయటకు రాదు ఆమెపై ఆ విధంగా మాట్లాడటం దారుణం అంటూ.
బోరున మీడియా ముందు ఏడ్చేశారు.దీంతో చంద్రబాబు ఏడవటం 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఇటువంటి తరుణంలో కావాలని చంద్రబాబు.ప్రజలలో సింపతి సంపాదించుకోవడం కోసం పొలిటికల్ స్టెంట్లు వేస్తున్నట్లు కూడా కామెంట్లు వచ్చాయి.
ఈ పరిస్థితిలో ఉంటే తాజాగా ఈ విషయం పై కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు.
మహిళలను ఎవరు కించపరిచిన తప్పే అని అన్నారు.వైయస్ సతీమణి విజయమ్మ అయినా.
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అయినా.ఓకే గౌరవం ఇవ్వాలని అన్నారు.
తన వ్యక్తిత్వాన్ని కించపరిచినట్లు భువనేశ్వరి భావిస్తే.తమ పార్టీ ఎమ్మెల్యేలంతా కన్నీటితో భువనేశ్వరి కాళ్లు కడుగుతా మని.
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కామెంట్ చేశారు.ఇటువంటి విషయానికి ముగింపు పలకాలని ఒక ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నిజంగా తప్పు జరిగిందని అటువంటి వ్యాఖ్యలు.వైసీపీ నాయకులు చేశారని భువనేశ్వరి అక్క భావిస్తే ఆమె అనుమతిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు అంతా కలిసి కన్నీటితో ఆమె కాళ్లు కడుగుతామని తెలిపారు.
అప్పట్లో సత్య హరిశ్చంద్రుడు ఇచ్చిన మాట కోసం భార్యను చక్రవర్తి ఇంటికి పని కి పంపితే ఈనాడు చంద్రబాబు.
ఓట్ల కోసం తన భార్య శీలాన్ని బజారు కిడ్చటం.ఏమాత్రం బాగోలేదని చంద్రబాబు ఇటువంటి నీచమైన రాజకీయాలు మానుకోవాలని.
లవంగాల పాలు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే రోజూ తాగేస్తారు..!