బాలకృష్ట వీరసింహారెడ్డి ఫ్లెక్సీలో వైసీపీ ఎమ్మెల్యే కుమారుడి ఫోటో!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య రాజకీయ పోటీ వైర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 రెండు పార్టీల మధ్య అనేక సందర్భాల్లో రాజకీయ వేడి పెరుగుతునే ఉంది.పలు సందర్భాల్లో అధికార బలంతో వైసీపీ టీడీపీని ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే.

  తాజాగా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నందమూరి బాలకృష్ణ రాబోయే చిత్రం  ఈవెంట్ వేదికను విషయంలోనూ కొంత ఇబ్బందికి గురిచేసింది.

 నందమూరి బాలకృష్ణ  తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేగా పని చేస్తున్నందున ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని అకస్మాత్తుగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ వేదిక మార్చడం రాజకీయ వేదింపులుగానే టీడీపీ భావిస్తుంది.

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నంలో వైసీపీ కనిపిస్తున్న తరుణంలో ఆశ్చర్యకరంగా వైసీపీ ఎమ్మెల్యే తనయుడు వీరసింహారెడ్డి సినిమా కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరిగింది.

 ఈ ఫ్లెక్స్ అందరి దృష్టిని ఆకర్షించడంతో ఇప్పుడు ఆ ఫ్లెక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు.

యెమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి తనయుడు ధరణిధర్ పేరుతో ఫ్లెక్స్‌ను ఏర్పాటు చేశారు.

 సినిమా విడుదలకు ముందు ఫ్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాదు రానున్న రోజుల్లో ఎమ్మెల్యే కొడుకు కాబోయే నాయకుడని ఫ్లెక్స్‌లో పెట్టారు.

"""/"/ వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తుండడంతో ఒక్కసారిగా ఫ్లెక్స్ విషయం హాట్ టాఫిక్‌గా మారింది.

ఈ  ఫ్లెక్స్‌లో వీరసింహారెడ్డి సినిమాలోని  నందమూరి బాలకృష్ణ చిత్రంతో ధరణిధర్ ఫోటో కూడా  ఉంది.

 సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు రాబోయే రోజుల్లో భవిష్యత్ నాయకుడిగా ధరణీధర్ రెడ్డిని ఫ్లెక్స్ తో చెప్పకనే చెప్పారు.

యెమ్మిగనూరులోని రద్దీ ప్రదేశంలో  ఏర్పాటు చేసిన ఈ  ఫ్లెక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

 మరికొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే కొడుకు అనుచరులు ఈ ఫ్లెక్స్ ఏర్పాటు చేసి ఉండొచ్చని అంతే కానీ ఇందులో రాజకీయ కోణం లేదని వైసీపీ నేతలు అంటున్నారు .

బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ బంధం గురించి నారా లోకేశ్ అలా అన్నారా.. ఏమైందంటే?