వైసీపీ మంత్రులకు ఆ అదృష్టం లేదు

వైసీపీ మంత్రులకు ఆ అదృష్టం లేదు

ఏ విషయంలో అయినా మ్యాజిక్ అలాగే కంటిన్యూ అవాలన్నా ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఉండాలన్నా ఎండింగ్ అన్నది ముందే తెలియకుండా ఉంటేనే మేలు.

వైసీపీ మంత్రులకు ఆ అదృష్టం లేదు

కానీ వైసీపీ మంత్రులకు ఆ అదృష్టం లేదు.వారు కుర్చీ ఎక్కినపుడే రెండున్నరేళ్లకు దిగిపోవాల్సి ఉంటుందని డెడ్ లైన్ పెట్టేసారు.

వైసీపీ మంత్రులకు ఆ అదృష్టం లేదు

దాంతో వారు నాటి నుంచి రోజులను లెక్కేసుకునే పరిస్థితి ఉంది.అయితే ఈ మధ్యలో కరోనా పుణ్యామాని మరో నాలుగు నెలల పాటు వారికి ఎక్స్ టెన్షన్ లభించి కొంత టెన్షన్ అయితే తగ్గింది.

అయితే ఇలాగే మరిన్నాళ్ళు ముచ్చట సాగుతుంది అనుకుంటున్న వేళ సడెన్ గా మార్చి నెలలో మంత్రి వర్గ విస్తరణ అంశం ముందుకు తెచ్చారు.

నాటి నుంచి అంటే దాదాపు నెల రోజుల నుంచి చాలా మంది మంత్రుల మనసు స్థిమితంగా అయితే లేదు.

ఇక బడ్జెట్ సెషన్ అయింది.ఆ మీదట ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ తాము ఉంటామా లేదా అని ఆలోచిస్తూ గడిపారు.

"""/"/ ఏప్రిల్ నెల ప్రవేశిస్తూనే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.ఆ మీదట ముహూర్తాలు కూడా సెట్ కావడంతో తాము మాజీలం అయిపోతున్నామన్న కంగారు అయితే అందరిలోనూ వచ్చేసిందంటారు.

ఇక అందరి మంత్రుల రాజీనామాలను జగన్ మరి కొద్ది గంటలలో తీసుకోబోతున్నారు అన్నది ప్రచారంలోకి రావడంతో మంత్రులంతా లాస్ట్ వర్కింగ్ డే గా ఏప్రిల్ ఆరవ తేదీని చూస్తున్నారు.

దాంతో ఇన్నాళ్ళూ పనిచేసినది ఒక ఎత్తు.ఈ ఒక్క రోజూ మరో ఎత్తు అని వారు తలపోస్తున్నారు.

అందుకే చాలా మంది మంత్రులు తమ సొంత నియోజకవర్గాల్లోనే గడుపుతున్నారు.మంత్రులుగా తమ అధికారాలతో తాము చేయాల్సిన పనులు ఏంటి అన్నవి చూసుకుని మరీ చేస్తున్నారు.

క్రిష్ణా జిల్లాకు చెందిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే ముఖ్యమంత్రి సహాయాన్ని లబ్దిదారులకు అందించడం ద్వారా తన నియోజకవర్గంలో లాస్ట్ వర్కింగ్ డేని సంతృప్తిగా గడిపారు.

ఇక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపి విశ్వరూప్ గోదావరి జిల్లాలోని తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలను జనాలకు వివరించే ప్రయత్నం చేశారు.శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ తన సొంత నియోజకవర్గం నరసన్నపేటను వీడి రావడంలేదు.

అక్కడ ఆయన అనేక ప్రారంభోత్సవాలను చేస్తున్నారు. """/"/ అలాగే విజయనగరంలో బొత్స సత్యనారాయణ బిజీ బిజీగా గడుపుతున్నారు.

విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాసరావు భీమిలీలో పలు కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.మొత్తానికి చూస్తే చాలా మంది మంత్రులు అంతా తాము మాజీలు అవుతున్నామన్న దిగులుతో ఉంటూనే తమ హయాంలో చేయగలిగింది ఏమైనా ఉందా అన్నది చూసి మరీ ఆ పనులు పూర్తి చేస్తున్నారు.

ఇక దీనికంటే ముందు లాస్ట్ వర్కింగ్ డే విషయాన్ని తెర మీదకు తెచిన వారు మంత్రి పేర్ని నాని.

ఆయన ఒక చానల్ డిబేట్ లో పాలుపంచుకుంటూ ఈ నెల 6 తమకు చివరి పని దినం మంత్రిగా ఆఖరు రోజు అని చెబుతూ కాస్తా భావోద్వేగానికి గురి అయ్యారు.

మొత్తానికి వైసీపీ మంత్రులు అంతా బాగా పనిచేశారు అని చెప్పకపోయినా అవినీతి ఆరోపణలు అయితే ఎవరి మీద పెద్దగా లేవు.

అయినా సరే వారిని తప్పిస్తున్నారు అన్న బాధ వారితో పాటు అనుచరులలోనూ ఉంది.

మరి వీరి బాధ అసంతృప్తిగా ఆ మీదట అసమ్మతిగా మారితే దానికి తగిన మందు వేసి పరిష్కారం చూపే మంత్రదండం వైసీపీ పెద్దల వద్ద ఉందా అన్నదే ఇపుడు చర్చ.

ఆ వంటకాలు ఇష్టమని చెబుతున్న రీతూ వర్మ.. మూడు పూటలు తినగలనంటూ?