వైసీపీ మంత్రులే విశాఖను ధ్వంసం చేస్తున్నారు..సీపీఐ నేత రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుతో అమరావతి అంశం ముగిసిందనుకుంటే.రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించి వెనక్కి తీసుకున్నట్లు అఫిడవిట్‌ వేసిందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు.

మళ్లీ ఇప్పుడు 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు.అమరావతి రైతులు చేపడుతున్న మహాపాదయాత్రపై రాష్ట్ర మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదన్నారు.

ఒక్క రాత్రిలో విశాఖ అభివృద్ధి కాలేదని.ఉక్కు కర్మాగారం, పోర్టు వంటివి వచ్చిన తర్వాతే ప్రగతి సాధించిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తుంటే వైసీపీ స్పందనేదని ప్రశ్నించారు.వైసీపీ మంత్రులే విశాఖను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లేపాక్షి భూములను సీఎం జగన్‌ మేనమామ కుమారుడు కొంటున్నారని.వెంటనే ఆ భూములను రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రోజు మార్నింగ్ ఈ డ్రింక్ తాగితే బాన పొట్ట వెన్నలా కరిగిపోతుంది..!