ప్రభుత్వం నిర్దారించిన సమయంలోనే షోలు ప్రదర్శించాలి.. మంత్రి పేర్ని నాని

అమరావతి: మంత్రి పేర్ని నాని కామెంట్స్.రోజూ 4 ఆటలు ఉండాల్సింది.

పది నుంచి 12 షోలు వేస్తున్నారు.సినిమా పరిశ్రమలో ఏమి చేసినా ఎవరూ పట్టించుకోరు అనే ఉద్దేశంతో ఉన్నారు.

బలహీనతలు సొమ్ము చేసుకునే వ్యవస్థను కట్టడి చేసే నిర్ణయం.ఆన్లైన్ లో టిక్కెట్లు అమ్మితేనే దోపిడీ అరికట్టగల మార్గం.

షోలు కూడా ప్రభుత్వం నిర్దారించిన సమయంలోనే షోలు ప్రదర్శించాలి.పరిశ్రమ ప్రభుత్వ నిబంధనల కు లోబడే నడుచుకోవాలి.

ఇష్టానుసారంగా నడుచుకునే అవకాశం ఉండకూడదు.ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు సినిమా చూసేలా మధ్యతరగతి వారి కోసం కొత్త విధానం.

టాక్స్ లు కూడా పొంతన కుదరడం లేదు.ఎవరూ టాక్స్ లు దాచేలా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించకుండా ఆన్ లైన్ విధానం.

తక్కువ రేటుకు వినోదం.ప్రభుత్వానికి టాక్స్ ల రూపంలో ఆదాయం సరిగా వస్తుంది.

సినిమా డిస్ట్రిబ్యూటర్ ప్రభుత్వంపై నిందలు వేస్తే అర్థం ఉంటుంది.కానీ ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం పై బురద వేయడం దురదృష్టం.

చంద్రబాబు, ఒక వర్గం మీడియా పై పేర్ని నాని సెటైర్లు.ప్రభుత్వం అప్పుల కోసం ఈ విధానం అని ఆరోపణలు చేయడం దురదృష్టకరం.

బస్సు, రైలు టిక్కెట్లు ఆన్ లైన్ తీసుకోవడానికి లేని అభ్యంతరం సినిమా టిక్కెట్లపై ఎందుకు? అత్యంత సౌలభ్యకరంగా సినిమా ను అందుబాటులోకి తెస్తాం.

డబ్బులు పోగు చేసుకోవాలని.అప్పులు తేవాలని ఆలోచన ప్రభుత్వానికి లేదు.

క్యూలైన్ లో నిలబడే అవసరం లేకుండా.టిక్కెట్లు తీసుకోవచ్చు.

ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్.. ఓజీ సినిమాపై థమన్ అంచనాలు పెంచేస్తున్నారా?