వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్ కామెంట్స్..!!
TeluguStop.com
ఈరోజు ఉదయం ప్రకాశం జిల్లా మార్కాపురంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని( Balineni Srinivasa Reddy ) పోలీసులు అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ పర్యటనలో ఈబీసీ నిధులను విడుదల చేయడానికి సీఎం మరియు జిల్లా నేతలు( CM Jagan ), అధికారులు మార్కాపురం చేరుకున్నారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రిని రిసీవ్ చేసుకోవడానికి హెలిప్యాడ్ దగ్గరికి బాలినేని వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడం జరిగిందంట.
వాహనం పక్కనపెట్టి నడిచి రావాలని దీంతో బాలినేని అలిగి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి.
"""/" /
అయితే ఈ వార్తలపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) స్పందించారు.
కావాలని ఒక వర్గం మీడియా వైసీపీ నాయకులను టార్గెట్ చేసుకుని విష ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరని పేర్కొన్నారు.అదేవిధంగా ప్రజలలో వైసీపీ గ్రాఫ్ తగ్గదని స్పష్టం చేశారు.
"""/" / వైసీపీలో అసమతి ఉందని తెగ ప్రచారం చేస్తున్నారు.నిజంగా అసమతి ఉంటే దాన్ని తగ్గించే శక్తి కూడా తమ దగ్గర ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రియుడితో జంప్ అవ్వడానికి ప్రయత్నించిన మహిళా కానిస్టేబుల్.. భర్త ఎంట్రీతో?