అక్టోబర్ మొదటి తారీకు నుండి విశాఖలో ఇన్ఫోసిస్ సేవలు అంటున్న వైసీపీ మంత్రి..!

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా విశాఖపట్టణానికి ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే.త్వరలోనే పరిపాలన కూడా విశాఖ కేంద్రంగా ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే కొంతమంది వైసీపీ మంత్రులు తెలియజేయడం జరిగింది.

ఇటువంటి తరుణంలో వైసీపీ పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గురించి ట్విటర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

అక్టోబర్ మొదటి తారీకు నుండి విశాఖలో ఇన్ఫోసిస్ సేవలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

"ఐటీ, దిగ్గజం ఇన్ఫోసిస్ అక్టోబర్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది.

తొలుత 1,000 మంది ఉద్యోగుల సామర్ధ్యంతో మొదలుపెట్టి, క్రమంగా 3 వేల మందికి ఉద్యోగాలకు విస్తరించనున్నారు".

అని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఇక ఇదే విషయాన్ని అంతకుముందు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా తెలియజేయడం జరిగింది.

మొత్తం మీద చూసుకుంటే విశాఖ కేంద్రంగా ఐటి హబ్ తయారయ్యేలా ప్రముఖ టెక్ కంపెనీలను ఆకర్షించే రీతిలో వైసీపీ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

Coriander : అమ్మ బాబోయ్‌.. కొత్తిమీర‌ను ప‌చ్చిగా తిన‌డం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..?