ఇవాళ వైసీపీ మ్యానిఫెస్టో విడుదల..!

ఏపీలో ఎన్నికలు( AP Elections ) సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్( CM YS Jagan ) మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.

ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న వర్గాలకు చేయూత ఇవ్వడమే లక్ష్యంగా పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే మ్యానిఫెస్టో( YCP Manifesto )పై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది.

మేమంతా సిద్ధం బస్సు యాత్రను నిర్వహించిన జగన్ ప్రజల విజ్ఞప్తుల మేరకు హామీలను పొందుపర్చారని సమాచారం.

"""/"/ గత ఎన్నికలకు నవరత్నాలు( Navaratnalu ) పేరుతో తెచ్చిన మ్యానిఫెస్టో ప్రజలకు బాగా కనెక్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ తరహాలోనే అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈసారి నవరత్నాల ప్లస్ పేరుతో ఎన్నికల మ్యానిఫెస్టోను రెడీ చేశారని తెలుస్తోంది.

అలాగే ఇందులో ప్రధానంగా వైద్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాలకు పెద్ద పీట వేశారని సమాచారం.

కాగా ఇవాళ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్న సీఎం జగన్ రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు.

వివాదంలో చిక్కుకున్న సింగర్ మధుప్రియ…. అరెస్టు చేయాలి అంటూ డిమాండ్?