YCP Manifesto : ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అయ్యేలా వైసీపీ మేనిఫెస్టో.. నవరత్నాలను మించేలా ప్లాన్ చేశారంటూ?
TeluguStop.com
మరో 48 గంటల్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది.వైసీపీ మేనిఫెస్టో విడుదలైతే పొలిటికల్ గా వైసీపీకి కచ్చితంగా భారీ స్థాయిలో బెనిఫిట్ కలుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
టీడీపీ 50 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి 4000 రూపాయల పెన్షన్, ఫ్రీగా మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పేరుతో కుటుంబంలో చదివే ప్రతి విద్యార్థికి 15000 రూపాయలు, ఇతర స్కీమ్స్ ను అమలు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈ హామీలను మించి ప్రజలకు మేలు చేసే మరిన్ని హామీలు ఇచ్చే దిశగా వైసీపీ అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.
వైసీపీ నేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకుందని తెలుస్తోంది.
పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా మేనిఫెస్టోను ప్రకటించనున్నారని భోగట్టా. """/"/
నవరత్నాలకు అప్ గ్రేడెడ్ వెర్షన్ లా మేనిఫెస్టో ఉండనుందని తెలుస్తోంది.
విద్యార్థుల సంక్షేమంతో పాటు రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వాతాతలకు, యువతకు వైసీపీ పెద్ద పీట వేస్తోందని సమాచారం.
పేదలతో పాటు మధ్యతరగతి వర్గాలకు బెనిఫిట్ కలిగేలా వైసీపీ మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.
మౌలిక సదుపాయాల కల్పన హామీలను సైతం జగన్ కల్పించనున్నారని భోగట్టా.గతంతో పోలిస్తే ఎక్కువ లబ్ధి కలిగేలా వైసీపీ నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది.
"""/"/
ఇచ్చిన హామీలను అమలు చేసే పార్టీగా వైసీపీకి పేరు ఉండటంతో నవరత్నాల మేనిఫెస్టో పార్టీకి కచ్చితంగా మేలు చేస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
టీడీపీ మరికొన్ని కొత్త హామీలను ప్రకటిస్తుందా? లేక ఇప్పటివరకు ప్రకటించిన హామీలకే పరిమితమవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.
వైసీపీ రాబోయే రోజుల్లో గెలుపు కోసం మరిన్ని కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.
వైసీపీ అభ్యర్థులలో చాలామంది ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు.
జక్కన్న సినిమాకు మహేష్ ఆ సెంటిమెంట్ పాటిస్తారా.. విమర్శలకు చెక్ పెట్టారుగా!