ఒక్కొక్కరుగా తిరుగుబాటు మొదలుపెట్టారే ?
TeluguStop.com
ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి గెలిచి అధికారంలోకి వచ్చింది.
వైసిపి( YCP ) ఊహించని స్థాయిలో చేదు ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది.175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు.
దీంతో ప్రతిపక్ష హోదా కూడా వైసిపి కోల్పోయింది.వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువయ్యామని , పెద్ద ఎత్తున ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేశామని, 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్ని దాదాపుగా అమలు చేశామని, మళ్లీ రెండోసారి విజయం దక్కుతుందని వైసిపి అధినేత జగన్( YS Jagan ) భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.
చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి కొత్తవారికి అవకాశం ఇచ్చారు.సామాజిక వర్గాల సమన్యాయం పేరుతో భారీగా అభ్యర్థుల మార్పు చేర్పులు చేపట్టారు.
"""/" /
ఐప్యాక్ సంస్థ అందించిన రాజకీయ వ్యూహాలను అమలు చేశారు.అయినా అవేమీ వైసీపీకి వర్కౌట్ కాలేదు.
ఇక ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి వైసిపి నేతలు సమీక్షలు చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా కొంతమంది వైసిపి నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు, మాజీ మంత్రులు ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ పార్టీ అధినేత తీరుపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం రాజానగరం వైసిపి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా( Jakkampudi Raja ) ఓటమి కి గల కారణాలను వివరిస్తూ జగన్ వైఫల్యాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు.
జగన్ కొంతమంది అధికారులను గుడ్డిగా నమ్మారని ,అందుకే వైసిపి ఓడిపోయిందని అన్నారు.ముఖ్యంగా ధనుంజయ రెడ్డి లాంటి అధికారుల వల్ల వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందని జక్కంపూడి రాజా మండిపడ్డారు.
ఇక మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్( Guada Amarnath ) కూడా వైసిపి వైఫల్యాలపై మాట్లాడారు.
"""/" /
వాలంటీర్ వ్యవస్థ విఫలం కావడంతో నే ఈ ఫలితాలు వచ్చాయని అన్నారు .
తాజాగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ( Kottu Satyanarayana ) కూడా జగన్ వైఫల్యాలపై స్పందించారు.
జగన్ కొంతమంది అధికారులను గుడ్డిగా నమ్మడం వల్లే వైసిపి ఓడిపోయింది అంటూ వ్యాఖ్యానించారు.
ఐపాక్ సంస్థ వాలంటీర్ వ్యవస్థ వల్ల వైసీపీ ఓడిపోయిందని కొట్టు సత్యనారాయణ అన్నారు ఆఫీసులో కూర్చుని ఏపీ రాజకీయాలను ఐ ప్యాక్ సంస్థ శాసించే ప్రయత్నం చేసిందని, అసలు గ్రౌండ్ రిపోర్ట్ వాళ్లకు తెలియదని, ఐ ప్యాక్ సంస్థ ఒక పనికిమాలిన సంస్థ అంటూ కొట్టు సత్యనారాయణ విమర్శించారు.
వీటితోపాటు మరికొంతమంది వైసిపి నాయకులు బహిరంగంగా జగన్ అప్పటి నిర్ణయాలను తప్పుపడుతూ బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.
యూదులతో బంధాలు బలోపేతం.. ప్రధాని మోడీపై భారతీయ అమెరికన్ ప్రశంసల వర్షం