ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో టీడీపీ లో చేరిన పలువురు వైసీపీ కార్యకర్తలు ..

ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీ లో చేరారు.

కేశినేని నాని వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు రాజకీయంగా‌ చైతన్యం కలిగినవారని, ఇక్కడ గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు.

2019 ఎన్నికలలో ఎమ్మెల్యే స్థానం పోయినా.ఎంపీగా తనకు‌ 15 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారన్నారు.

వచ్చే ఎన్నికలలో టీడీపీ విజయం కోసం అందరూ కలిసి పని చేస్తున్నారని, ఎంతమంది నాయకులు ఉన్నా.

పార్టీ కార్యాలయం పెట్టలేక పోయారన్నారు.జైన్ అనే వ్యక్తి ఇటీవల ముందుకు వచ్చి పార్టీ కార్యాలయం కట్టించారని, నాయకులుగా చలామణి అవడం కాదని.

పార్టీ కోసం పని‌ చేయాలని కేశినేని నాని అన్నారు.టీడీపీకి పశ్చిమ నియోజకవర్గం ఒక మోడల్‌గా నిలవాలన్నారు.

రాష్ట్ర పార్టీ ఏ పిలుపు ఇచ్చినా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందరూ కలిసి ఇదే విధంగా బాగా పని చేయాలని పిలుపిచ్చారు.

నీతి నిజాయితీ, పార్టీ శ్రేణులకు ఆమోద యోగ్యమైన అభ్యర్థి ఉంటే వచ్చే ఎన్నికలలో 25వేల మెజారిటీతో టీడీపీ విజయం ఖాయమని కేశినేని నాని అభిప్రాయం వ్యక్తం చేశారు.