వైసీపీ లో ' జిల్లాల ' మంటలు ? ఎవరికి వారే ?
TeluguStop.com
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు తో సీఎం జగన్ పెద్ద సంచలనానికి తెర తీశారు.
ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లా చొప్పున ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ సైతం జారీ చేశారు.
కొత్త జిల్లాల పేర్ల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.జిల్లాలో ప్రముఖ వ్యక్తుల పేర్లతో వాటిని ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టారు.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి తెలుగుదేశం పార్టీ , నందమూరి అభిమానులలోనూ సానుకూలత సంపాదించారు.
అయితే కొన్ని కొన్ని చోట్ల మాత్రం కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త తలనొప్పులు జగన్ కు మొదలయ్యాయి.
ముఖ్యంగా దివంగత వంగవీటి మోహన్ రంగ పేరును ఒక జిల్లాకు పెట్టాలని డిమాండ్ మొదలైంది.
అయితే వేర్వేరు పార్టీలకు చెందిన వారు ఈ డిమాండ్లను తెరపైకి తెచ్చినా, వైసీపీ ఎమ్మెల్యేలు సైతం కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడం, కొంత మంది వైసీపీ నాయకుల బహిరంగంగా ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ను తప్పు పడుతూ ఉండడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు నియోజక వర్గాన్ని పరిగణలోకి తీసుకుంటే , ఈ నియోజకవర్గంలో ఉన్న భీమవరం ను జిల్లా కేంద్రం చేయడంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయే పరిస్థితి.
అంతేకాదు కలెక్టర్ ను కూడా కలిసి ఫిర్యాదు చేశారు. """/" /
అలాగే జగన్ సొంత జిల్లా కడప జిల్లాలోనూ జిల్లా కేంద్రం విషయమై పై పెద్ద దుమారమే రేగుతోంది.
బహిరంగంగానే వైసీపీ కి గుడ్ బై చెబుతున్నట్లు ఫ్లెక్సీలు కట్టి మరీ తమ నిరసనను తెలియజేస్తున్న పరిస్థితి.
ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక ప్రాంతాల్లో ఈ కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ కీలక నాయకులే వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇది ఆయా ప్రాంతాలు ప్రజల తో మమేకమైన సమస్య కావడంతో, ఈ విషయంలో పార్టీని సైతం వారు లెక్కచేయకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎక్కడికక్కడ సొంత పార్టీ నేతలే బహిరంగంగా నిరసన తెలుపుతూ ఈ విషయంలో వివాదాలకు దిగుతుండడం వైసిపి అధిష్టానానికి సైతం తలనొప్పిగా మారింది.
ఇంతమంది ప్రేమ పొందిన నేను అదృష్టవంతుడిని.. కిరణ్ అబ్బవరం ఎమోషనల్ పోస్ట్ వైరల్!