ఢిల్లీ మద్యం స్కాంలో వైసిపి నేతలకి సంబంధం ఉంది – టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి

ఢిల్లీ మద్యం స్కాం లో ఏపీకి చెందిన వైసిపి నేతలకి సంబంధం ఉందని ఆరోపించారు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి.

లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు శరత్ చంద్రారెడ్డిని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

శరత్ చంద్ర రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందన్నారు.

శరత్చంద్ర రెడ్డి అప్రూవల్ గా మారితే ఏపీలో కీలక నేతల పేర్లు బయటికి వస్తాయని, అందుకోసమే ఆయన్ని బెదిరించేందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి ఢిల్లీలో శరత్ ని కలిశారని తెలిపారు.

అక్రమ మద్యాన్ని ఏపీలో ఏరులై పారించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని, జగన్ ని జగ్గు భాయ్ అంటూ విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం లిక్కర్ స్కామ్ లో ఏపీకి చెందిన వైసీపీ నేతలని విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆనం వెంకటరమణారెడ్డి.

వైరల్ వీడియో: అతిథులపై రూ.20 లక్షల నోట్ల వర్షం కురిపించిన వరుడి బంధువులు