కమ్మ సామాజికవర్గానికి ఆమంచి క్షమాపణ..!
TeluguStop.com
కమ్మ సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పర్చూరు వైసీపీ ఇంఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ అన్నారు.
తన మాటలు తన మిత్రులకు బాధ కలిగించినందుకు క్షమించాలని కోరారు.అయితే తన క్షమాపణలు కరణం వెంకటేశ్ కు వర్తించవని ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు.
అయితే వేటపాలెం ఘటనలో కమ్మ సామాజిక వర్గంపై ఆయన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయనపై ఆ సామాజికవర్గానికి చెందిన సభ్యులు తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే అందరికీ క్షమాపణలు కోరుతున్నానన్న ఆమంచి ఓ వీడియో విడుదల చేశారని తెలుస్తోంది.