ఐప్యాక్, ఆరా మస్తాన్ సర్వేలపై సీరియస్ వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత..!!

ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ( YCP ) ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే.

11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు మాత్రమే గెలవడం జరిగింది.ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పుకి వైసీపీ నాయకులు అంతా షాక్ అయిపోయారు.

2024 ఎన్నికలలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ( YS Jagan )ఎక్కువగా ఐప్యాక్ సూచనలనే పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకున్నారు.

పార్టీ ఎమ్మెల్యేలు.మంత్రుల పనితీరుపై ఆ సంస్థతోనే సర్వేలు చేయించుకున్నారు.

ఈ క్రమంలో చాలా చోట్ల అభ్యర్థులను మార్పులు చేయడం జరిగింది.ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్ ప్రకటనలో నమ్మదగిన సంస్థగా పేరొందిన ఆరా మస్తాన్.

వైసీపీ అధికారంలోకి రాబోతున్నట్లు 105కి పైగా స్థానాలలో గెలుస్తుందని ప్రకటించడం జరిగింది. """/" / తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే 11 చోట్ల మాత్రమే వైసీపీ గెలిచింది.

ఇదిలా ఉంటే ఫలితాలు అనంతరం ఓటమి చెందిన వైసీపీ నాయకులు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగుట్ల స్వామి దాసు ( MLA Candidate Nallagutla Swamy Das )ఐప్యాక్ సంస్థ, ఆరా మస్తాన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

ఐప్యాక్ తప్పుడు రిపోర్టులు ఇచ్చిందని మండిపడ్డారు.వైసీపీ గెలుస్తుందని ఆరా మస్తాన్ కూడా ముంచేశాడని వ్యాఖ్యానించారు.

ఎన్నికల వల్ల వైసీపీ నాయకులంతా ఆర్థికంగా నష్టపోయారని పేర్కొన్నారు.మస్తాన్ మరో లగడపాటి అయ్యారని ఎద్దేవా చేశారు.

ఆ విషయంలో జక్కన్నను ఫాలో అవుతున్న అల్లు అర్జున్.. సినిమా సక్సెస్ అవుతుందా?