పోలింగ్ అనంతరం దాడులపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీలో పోలింగ్ అనంతరం తిరుపతి జిల్లా( Tirupati District ) చంద్రగిరిలో జరిగిన అల్లర్లపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి( Chevireddy Bhaskar Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని( Pulavarthi Nani ) ఆడిన డ్రామాల వలనే నియోజకవర్గంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పులవర్తి నానిని తాను రాజకీయ ప్రత్యర్థిగానే చూశానని తనపై ఎన్ని విమర్శలు చేసినా తిరిగి విమర్శ చేయలేదని చెప్పారు.

ఏనాడు దాడులు కొట్లాట్లకు దిగాలని ఆలోచన కూడా తమకి లేదని చెవిరెడ్డి చెప్పుకొచ్చారు.

పులవర్తి నానిపై దాడి ఘటనలో పోలీసులు పలువురు వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో శనివారం తిరుపతి ఎస్పీ కార్యాలయానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేరుకున్నారు.

ఈ క్రమంలో దాడి ఘటనలో సంబంధంలేని వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేశారని ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు వివరించారు.

దాడి ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ను ఎస్పీకి అందజేశారు. """/" / ఆ వీడియోను పరిశీలించి దాడికి సంబంధం లేని వ్యక్తులను విడుదల చేయాలని కోరారు.

అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడటం జరిగింది.నామినేషన్ రోజు తన కొడుకుపై దాడి చేసిన తామేమి తిరిగి దాడి చేయలేదని చెప్పుకొచ్చారు.

అవమానాన్ని భరించామే తప్ప ప్రతీకారాలకు వెళ్లలేదని స్పష్టం చేశారు.అసత్య ఆరోపణలు, వ్యక్తిత్వ హననం చేసిన తాను ఎలాంటి కామెంట్ చేయలేదని స్పష్టం చేశారు.

పులవర్తి డ్రామాల వల్ల నియోజకవర్గంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని ఆరోపించారు.ప్రతీకార గొడవలకు వెళ్లాలని ఆలోచన తమకి లేదని స్పష్టం చేశారు.

కూచి వారి పల్లిలో జరిగిన చిన్న గొడవ పట్టుకుని విపక్షాలు రాద్ధాంతం చేశాయి.

ఇల్లు కాల్చారు.రెండు కార్లు ధ్వంసం అయ్యాయి.

మూత్రం పోసి ఒక అబ్బాయిని దారుణంగా కొట్టారు.అయినా ఎక్కడ కూడా తాము కేసులు పెట్టలేదు.

అవమానాన్ని భరించాము.యూనివర్సిటీ దగ్గర నాని కారుపై దాడి తప్పేనని తెలిపారు.

ఆ కారు పై దాడి జరిగిన తర్వాత.నాని యాక్టివ్ గా నడుచుకుంటూ వెళ్లారు.

రెండు గంటల తర్వాత వీల్ చైర్ లో ఉన్నారు.ఇదంతా డ్రామా అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

నటుడుగా, నిర్మాతగా నాని ఇప్పటివరకు సంపాదించిన ఆస్తులు ఎంతో తెలుసా?