తెదేపా కార్యకర్తల సైకిల్ ర్యాలీని అడ్డుకుని, బట్టలు విప్పించిన వైకాపా నాయకుడు..

తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు త్వరలో అక్రమ అరెస్ట్ కేసు నుండి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని టిడిపి కార్యకర్తలు శ్రీకాకుళంలో నుంచి కుప్పం వరకు ఉన్న దేవాలయాలలో పూజలు చేసుకుంటూ సైకిల్ యాత్రలో భాగంగా పుంగనూరు మండలం సుగాలి మిట్ట వద్దకు చేరుకున్నారు.

ఓ టీ దుకాణం వద్ద సేద తీర్చుకునే సమయాన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు నాగభూషణంకు రైట్ హ్యాండ్ చంగలాపురం సూరి వారిని నా నా దుర్భషలాడి దారుణంగా బట్టలు విప్పించాడు.

సైకిల్ కి కట్టుకున్న తెదేపా పార్టీ జండాను లాగి రోడ్డుపై పడేసాడు.చంగలాపురం సూరి భూ దందాలు, సెటిల్మెంట్లు చేసేవాడని, ఇతనిపై గతంలో రౌడీ షీట్ వున్నిందని.

వైకాపా అధికారంలో వచ్చిన తరువాత రౌడీ షీట్ ఎత్తేసారని స్థానికులు తెలిపారు.

అద్భుతం, అడవి జంతువుకు దైవభక్తా.. శివలింగాన్ని హత్తుకున్న ఎలుగుబంటి వీడియో వైరల్!