విజయవాడ అర్బన్ లో పొలిటికల్ హీట్..!!
TeluguStop.com
విజయవాడలో ( Vijayawada ) పొలిటికల్ హీట్ పెరుగుతోంది.పార్టీల్లో బుజ్జగింపులు, సంప్రదింపులు కొనసాగుతున్న నేపథ్యంలో అర్బన్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
తాజాగా విజయవాడ అర్బన్ కు చెందిన కీలక వైసీపీ నేత బొప్పన భవకుమార్( Boppana Bhavakumar ) ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే పలువురు టీడీపీ ముఖ్యనేతలు ఆయనతో వరుసగా సమావేశాలు అవుతున్నారని సమాచారం.
ఇందులో భాగంగా ఇవాళ బొప్పన భవకుమార్ టీడీపీ నేత నారా లోకేశ్ తో భేటీ కానున్నారు.
"""/" /
టీడీపీలో చేరిక అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
కాగా టీడీపీలోకి రావాలని బొప్పనకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్( Gadde Ram Mohan ) ఆహ్వానం పలికారు.
అలాగే వంగవీటి రాధాకృష్ణ, కేశినేని చిన్ని, బోండా ఉమా బొప్పనను కలిశారని తెలుస్తోంది.
మరోవైపు బొప్పనను వైసీపీ అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది.కాగా దేవినేని అవినాశ్ కు( Devineni Avinash ) తూర్పు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించడంతో వైసీపీ అధిష్టానంపై బొప్పన అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.
ఇదేం ఆనందాంరా బాబు.. విడాకులు వచ్చాయని ఏకంగా?