ఎన్నికల వేళ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చెప్పిన వైసీపీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉంది.ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఎన్నికల ప్రచారంలో మిగతా పార్టీల కంటే ముందంజలో ఉంది.

ఆ పార్టీ అధినేత వైయస్ జగన్(YS Jagan) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఎట్టి పరిస్థితులలో అధికారం చేజారిపోకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతున్నారు.

గడపగడపకు మన ప్రభుత్వం, సిద్ధం, మేమంతా సిద్ధం వంటి కార్యక్రమాలతో మొన్నటిదాకా ఎలక్షన్ ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఇదిలా ఉంటే పోలింగ్ కి 11 రోజులు మాత్రమే సమయం ఉండటంతో.వైసీపీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.

"""/" / ఈ కార్యక్రమం పేరు."కలలో నిజం చేయటానికి.

జగన్ కోసం సిద్ధం".ఇప్పటికే దీనికి సంబంధించిన హోర్డింగ్ లు, పోస్టర్ లు రాష్ట్రవ్యాప్తంగా దర్శనం ఇస్తున్నాయి.

ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఇటీవల సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించడం.

ఈ క్రమంలో ప్రతి ఇంటికి చేరవేయాలని ఈ కొత్త కార్యక్రమానికి వైసీపీ నాయకులు రెడీ కావడం జరిగింది.

ప్రజలే తమ స్టార్ క్యాంపెనర్ లు అని ఇటీవల సభలో తరచుగా సీఎం జగన్ (CM Jagan) చెబుతూనే ఉన్నారు.

దీంతో ఈ కార్యక్రమంలో తమ ప్రచార పర్వంలో భాగం చేయాలని భావిస్తున్నారు.2019 ఎన్నికల కంటే 2024 ఎన్నికలను వైయస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఈసారి ఎన్నికలలో గెలిస్తే దాదాపు 30 సంవత్సరాలు పాటు వెనక్కి తిరిగి చూసుకో అక్కర్లేదని భావిస్తున్నారు.

అమెరికాలో హైదరాబాద్ యువకుడు దారుణ హత్య..