మార్కెట్ లో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన వైసీపీ – జనసేన క్రాకర్స్!

మార్కెట్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు లేదా రాజకీయ నాయకుల పేర్లను ఉపయోగించుకొని కొన్ని ప్రొడక్ట్స్ ని అమ్ముకోవడం వంటివి ఇన్ని రోజులు మనమంతా చూసాము.

ఈ ఏడాది దీపావళి కి కూడా అలాంటిదే చెయ్యడానికి చూసారు.ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన పార్టీలుగా పిలవబడే టీడీపీ, జనసేన మరియు వైసీపీ పార్టీల పేర్లను, ఆ పార్టీ వ్యవస్థాపకులు క్రాకర్స్ అట్టల మీద వేసి అమ్ముతున్నారు.

జనాలు దీనికి ఎగబడి మరీ ఈ క్రాకర్స్ ని కొనుగోలు చేస్తున్నారు.ముఖ్యంగా జనసేన పార్టీ అట్టల తో కూడిన క్రాకర్స్ ని అత్యధికంగా అమ్ముడుపోయినట్టు టాక్ వినిపిస్తుంది.

పవన్ కళ్యాణ్( Pawan Kalyan) కి రాజకీయ నాయకుడి ఇమేజి మాత్రమే కాకుండా సినీ హీరో గా కూడా ఒక రేంజ్ లో ఇమేజ్ ఉండడం వల్ల, ఆ పార్టీ కి సంబంధించిన అట్టలు ఉన్న క్రాకర్స్ ఎక్కువగా అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది.

"""/" / మామూలు క్రాకర్స్ కంటే, ఇలా పార్టీలకు అనుకూలంగా పెట్టిన క్రాకర్స్ ఎక్కువగా అమ్ముడుపోతున్నట్టు సమాచారం.

ఈ ఐడియా ఎదో బాగుంది, ఇలాగే హీరోలు హీరోయిన్ల ఫోటోలను పెట్టి వచ్చే ఏడాది నుండి అమ్మితే రికార్డు స్థాయిలో డబ్బులు వస్తాయని, ఎవ్వరూ ఊహించని లాభాలను ఆర్జించవచ్చు అంటూ చెప్పుకొస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే జనసేన పార్టీ కి సంబంధించి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారు, అలాగే వైసీపీ పార్టీ( YCP Party ) కి సంబంధించి జగన్ ఫోటోని వేశారు.

కొత్తగా చెప్తున్నాడు ఏంటి, ఉన్న నిజమే కదా అది అని మీరు అనుకోవచ్చు.

కానీ టీడీపీ పార్టీ తరుపున చంద్రబాబు నాయుడు ఫోటోని కాకుండా స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామా రావు గారి ఫోటో ని వేశారు.

ఇదే ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ ని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు ఫోటో కానీ, లేదా నారా లోకేష్ ఫోటో కానీ వేస్తారు అనుకుంటే ఇలా జరిగిందేంటి అని అనుకుంటున్నారు కార్యకర్తలు.

ఏపీలో ట్రెండింగ్ బిజినెస్: పొలిటికల్ నాయకుల ఫోటోలతో క్రాకర్స్.ఎగబడి కొంటున్న జనం.

"""/" / అలా ఈ క్రాకర్స్ కి సంబంధించిన ఫోటో ఉదయం నుండి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతూ ఉంది.

జనసేన మరియు వైసీపీ పార్టీ తో పోలిస్తే టీడీపీ కి యూత్ లో ఉన్న ఆదరణ బాగా తక్కువ, అందుకే ఈ రెండు పార్టీల క్రాకర్స్ అమ్ముడుపోయిన రేంజ్ లో టీడీపీ వి అమ్ముడుపోలేదట.

ఇదంతా పక్కన పెడితే వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

డిసెంబర్ నెల నుండే ఎన్నికల ఫీవర్ ఒక రేంజ్ లో ఉండబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది.

సికింద్రాబాద్ లో హైటెన్షన్.. వారిపై లాఠీ చార్జీ