ఏపీలో అధికార వైసీపీ ఎంత బలంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆ పార్టీకి 151 ఎమ్మెల్యేల బలం ఉంది.
వీరితో పాటు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక జనసేన ఎమ్మెల్యే మద్ధతు కూడా వైసీపీకి ఉంది.
దీంతో 156 ఎమ్మెల్యేల బలం వైసీపీకి ఉంది.అంటే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 156 చోట్ల వైసీపీకి తిరుగులేదు.
అయితే అధికారంలో ఉండటంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిక్యం కనిపిస్తోంది.
కాకపోతే కొన్నిచోట్ల టీడీపీకి వైసీపీ చెక్ పెట్టలేకపోతుంది.అలా టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పెద్దాపురం కూడా ఒకటి.
ఇక్కడ టీడీపీ తరుపున మాజీ హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పనిచేస్తున్నారు.టీడీపీ ద్వారా రాజకీయ జీవితం మొదలుపెట్టిన రాజప్ప, అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.
అనేక ఏళ్ల పాటు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడుగా పని చేసి, పార్టీని నిలబెట్టారు.
"""/"/
అలా పార్టీ కోసం పనిచేసిన రాజప్పకు, 2014 ఎన్నికల్లో చంద్రబాబు సీటు ఇచ్చారు.
చినరాజప్ప పెద్దాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచారు.అలాగే రాజప్పకు తన కేబినెట్‌లో హోమ్ మంత్రి పదవి ఇచ్చారు.
ఇక 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ గాలి ఉన్నా సరే, రాజప్ప టీడీపీ తరుపున గెలిచారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా సరే నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారు.అలాగే చంద్రబాబుకు సపోర్ట్‌గా ఉంటూ, జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు.
ఇక ఇక్కడ వైసీపీవీక్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది.గత ఎన్నికల్లో వైసీపీ తరుపున ఓడిపోయిన తోట వాణి పార్టీలో యాక్టివ్‌గా లేరు.