ఏపీలో వైసీపీ ‘సిద్ధం’..భీమిలి వేదికగా ఎన్నికల శంఖారావం..!!

ఏపీలో వైసీపీ ‘సిద్ధం’భీమిలి వేదికగా ఎన్నికల శంఖారావం!!

ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమైన తరుణంలో అధికార పార్టీ వైసీపీ మరోసారి గెలుపే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తోంది.

ఏపీలో వైసీపీ ‘సిద్ధం’భీమిలి వేదికగా ఎన్నికల శంఖారావం!!

క్యాడర్ లో జోష్ పెంచి ప్రజల్లోకి వెళ్లేందుకు సమరశంఖాన్ని పూరించనుంది.ఈ మేరకు ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల రణభేరీ మోగించనుంది.

ఏపీలో వైసీపీ ‘సిద్ధం’భీమిలి వేదికగా ఎన్నికల శంఖారావం!!

రానున్న ఎన్నికల సమరానికి సమాయత్తం అవుతోన్న వైసీపీ అధిష్టానం ‘సిద్ధం( YCP Siddham )’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సభలను ఏర్పాటు చేయనుంది.

ఇందులో ముందుగా విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

ఈ సందర్భంగా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.కాగా ఈ సభకు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి భారీఎత్తున తరలివెళ్లడానికి పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతుండగా .

మొత్తం నాలుగు లక్షల మంది సభకు హాజరవుతారని పార్టీ అధిష్టానం అంచనా వేస్తోంది.

"""/" / ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖ జిల్లాలోని విశాఖ - భువనేశ్వర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న తగరపువలస మూడు కోవెళ్లు ఎదురుగా ఉన్న స్థలంలో వైసీపీ భారీ బహిరంగ సభ జరగనుంది.

అంతేకాదు భీమిలి( Bheemili ) సభకు ప్రతి నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు గానూ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు.

అన్ని జిల్లాల నుంచి క్యాడర్ వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏ విధంగా చేరుకోవాలనేదానిపై ఇప్పటికే నాయకులు దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది.

"""/" / ఈసారి ఎన్నికల్లో వైసీపీ వై నాట్ 175 అనే నినాదంతో బరిలోకి దిగనుందన్న విషయం తెలిసిందే.

ఇందుకోసం నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారు.ముందుగా పార్టీ శ్రేణులతో మమేకం కావాలని నిర్ణయించిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సభలకు ప్లాన్ చేశారు.

ఇందులో భాగంగానే ఇవాళ భీమిలిలో సభ ఏర్పాటు అవుతోంది.కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోనున్న జగన్ పలు విషయాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది.

ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలనే దానిపై క్యాడర్ కు సీఎం జగన్( CM Jagan ) పలు సూచనలు ఇవ్వనున్నారని సమాచారం.

కాగా మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు ఈ సభకు హాజరుకానున్న సంగతి తెలిసిందే.

షుగర్ కంట్రోల్ నుంచి వెయిట్ లాస్ వరకు ఈ హెర్బ‌ల్‌ డ్రింక్ తో అదిరే బెనిఫిట్స్ మీ సొంతం!

షుగర్ కంట్రోల్ నుంచి వెయిట్ లాస్ వరకు ఈ హెర్బ‌ల్‌ డ్రింక్ తో అదిరే బెనిఫిట్స్ మీ సొంతం!