ఎంపీ ర‌ఘురామ‌కు ఆ విధంగా షాక్ ఇస్తున్న వైసీపీ..!

వైసీపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా అసంతృప్తిగా ఉంది.

అదే ఎంపీ రఘురామ కృష్ణం రాజు.ఈయన గెలిచింది వైసీపీ జెండా మీదే.

కానీ ప్రస్తుతం ఆయన రెబల్ గా మారారు.ఇతడిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక వైసీపీ అధిష్టానం తలలు పట్టుకుంటోంది.

ఇక ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా రఘురామకు బిగ్ షాక్ ఇచ్చారు.

లోక్ సభలో నడుస్తున్న జీరో అవర్ లో రఘురామ అమరావతి రైతులను పొగుడుతూ ప్రసంగించారు.

వారు చేస్తున్న పాదయాత్ర అమోఘం అన్నారు.కానీ వారిని అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారని ఇది అప్రజాస్వామికమని తెలిపారు.

వారికి హై కోర్టు అనుమతులు కూడా ఉన్నాయని గుర్తు చేశారు.ఇంతలో వైసీపీ మరో ఎంపీ మిథున్ రెడ్డి లేచి నిలబడి రఘురామకు బిగ్ షాక్ ఇచ్చారు.

ఆయన రఘురామను ఏకి పారేశారు.రఘురామ కృష్ణం రాజు అధికార పార్టీ ( బీజేపీ) లో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారని అందుకోసమే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

రఘురామ మీద సీబీఐ కేసులు కూడా ఉన్నాయని వాటి విచారణను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

"""/"/ దీంతో రఘురామ లేచి నిలబడి నా మీద కేవలం రెండు సీబీఐ కేసులు మాత్రమే ఉన్నాయని అదే మీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద 100 కు పైగా సీబీఐ కేసులున్నాయని అన్నారు.

దీంతో లోక్ సభలో వైసీపీ ఎంపీలు గందరగోళం క్రియేట్ చేశారు.అమరావతి కోసం అక్కడి రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారని వారు ఇప్పుడు దేవస్థానం న్యాయస్థానం పేరిట పాద యాత్ర చేస్తున్నారని కానీ వారిని అడ్డుకోవడం తగదన్నారు.

ప్రజల ప్రాథమిక హక్కులను కూడా అడ్డుకుంటారా? అని ఏపీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

బోట్ స్ట్రోమ్ కాల్ 3 స్మార్ట్ వాచ్ ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!