వైసీపీ విధ్వంసాన్ని సృష్టిస్తోంది.. బీజేపీ ఎంపీ జీవీఎల్

ప్రజా ఛార్జ్ షీట్లలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు.

అనినీతి, అరాచక పాలనతో వైసీపీ విధ్వంసాన్ని ఛార్జ్ షీట్ల ద్వారా వివరించామని తెలిపారు.

స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, నేతలపై ప్రజాభిప్రాయం సేకరించామని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు.ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు.

మోదీ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.ఏపీ అభివృద్ధికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులను ఇస్తోందని తెలిపారు.

కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వ్యాఖ్యానించారు.

తనపై 8 సార్లు కొరడా ఝులిపించుకున్న అన్నామలై..