బీజేపీతో వైసీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుంది..: వైఎస్ షర్మిల

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) హాట్ కామెంట్స్ చేశారు.

బీజేపీని తుంగలోకి తొక్కాలన్న ఆమె రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు.పాలక పక్షం, ప్రతిపక్షం బీజేపీతో ములాఖత్ అయ్యారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.

ప్రత్యేక హోదా కోసం టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ఎప్పుడు పోరాటం చేయలేదని మండిపడ్డారు.

బీజేపీతో వైసీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుందని ఆరోపణలు చేశారు. """/" / ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో హోదా కోసం గట్టిగా మాట్లాడారన్న వైఎస్ షర్మిల అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కును నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఇప్పుడున్న ప్రభుత్వాలు పోవాలన్న ఆమె కాంగ్రెస్ రావాలని పిలుపునిచ్చారు.

బన్నీపై కేసును విత్ డ్రా చేసుకుంటాను.. రేవతి భర్త సంచలన నిర్ణయం వైరల్!