ఇప్పటం ఇళ్ళ కూల్చివేత..
TeluguStop.com
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఇళ్ళు కూల్చివేత మళ్ళి మొదలైంది.
జనసేన ఆవిర్భావ సభకు గ్రామం స్థలం ఇచ్చిందని ఒకే ఒక అక్కసుతో మా ఇల్లును కూల్చి వేస్తున్నారని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత సంవత్సరం నవంబర్లో రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉన్న 53 ఇళ్ళును గుర్తించి వాటి లో మొదటగా 25 ఇళ్ళ ను కూల్చివేసారు.
మిగిలిన 28 ఇళ్ళు ను శనివారం నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేతకు సిద్దపడ్డారు.
ఆందోళన ఉద్రిక్తతల పరిస్థితులు మరల చోటు చేసుకున్నాయి.నగరపాలక సంస్థ అధికారులు జెసిబిలని తీసుకొచ్చి భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతల ప్రారంభించారు.
అయితే గ్రామస్తులు కూల్చివేతను అడ్డుకుంటూ ఆందోళన వ్యక్తం చేశారు .దాదాపు 200 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు.
అయితే గ్రామస్తులు మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు ఇది కచ్చితంగా ప్రతీకార చర్య అని పవన్ కళ్యాణ్ సభకు మా గ్రామం భూమి ఇచ్చిన కారణంగానే మా ఇళ్ళు కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు .
గ్రామంలో రామాలయం తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఇళ్ళు కూల్చకుండ స్టే తెచ్చుకున్నారు.
"""/" /
టౌన్ ప్లానింగ్ అధికారి మాత్రం 1916 లో ఉన్న స్ట్రీట్ మ్యాప్ ప్రకారం మాత్రం మేము రోడ్డు విస్తరిస్తున్నామని దీంట్లో ఎటువంటి అపోహలు లేవని కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు, నూతక్కి మంగళగిరి మరికొన్ని చోట్ల కూడా రోడ్డు విస్తరణ చేపట్టామని వివరణ ఇస్తున్నారు.
జనసేన పార్టీ నాయకులు రామాలయం వద్ద కూల్చివేతకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణరెడ్డి రాజీనామా చేయాలని ధర్నా నిర్వహించారు గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం ఆటో, బస్సు సౌకర్యం కూడా లేని గ్రామంలో 70 అడుగుల రోడ్డు విస్తరించి ఏం సాధిస్తారని గ్రామస్తులు వాపోతున్నారు.
GPS లేని రోజుల్లోనే 3D మ్యాప్.. పురాతన ఆవిష్కరణతో సైంటిస్టులే విస్తుపోయారు!