వైసీపీ ప్రభుత్వం డ్యాన్సులు చేస్తోంది..: వైఎస్ షర్మిల

ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు( Gundlakamma Reservoir Project )ను ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( AP PCC Chief YS Sharmila ) పరిశీలించారు.

అనంతరం షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ కట్టిన ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని తెలిపారు.

నిర్వహణ లేకే గేట్లు కొట్టుకుపోయాయని షర్మిల ఆరోపించారు.వైసీపీ ప్రభుత్వం గేట్లు కొట్టుకుపోతుంటే డ్యాన్సులు చేస్తోందని విమర్శించారు.

మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తారు తప్ప పని చేయరని పేర్కొన్నారు.జగనన్నకు మరమ్మత్తులు చేయించడానికి మనసు రావడం లేదా అని ప్రశ్నించారు.

"""/" / ఇదేనా వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టడమని ధ్వజమెత్తారు.వైఎస్ఆర్( YSR ) కట్టిన ప్రాజెక్టును పట్టించుకోని వారు వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు.

ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే ప్రాజెక్ట్ కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.రూ.

10 కోట్లు ఇస్తే ప్రాజెక్టు నిలబడుతుందన్న షర్మిల వెలిగొండ ప్రాజెక్టును కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.

తండేల్ సక్సెస్ అవుతుందా..? దీనిమీద అల్లు అరవింద్ ఎలాంటి హోప్స్ పెట్టుకున్నాడు…