వైసీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు..: చంద్రబాబు

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఒక్క రోజులో నలుగురు రైతులు బలవన్మరణమా అని ప్రశ్నించారు.

అయితే నిన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలుస్తోంది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా రైతుల కష్టాలే కనిపిస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు.

ఈ క్రమంలో రైతుల సమస్యలపై ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.

నాగబాబు కు కాదు.. మళ్లీ వారికే రాజ్యసభ ఛాన్స్ ?