వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఎన్నికలకు సరికొత్త రీతిలో వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.
ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం గాలి తగ్గుముఖ్యం పట్టడం.ప్రజా వ్యతిరేకత.
తెలంగాణ ఎన్నికల ప్రభావం ఇవన్నీ ఆ పార్టీకి పెద్ద ఇబ్బందికరంగా మారాయి.దీంతోపాటు ఎన్నికలకు ఒంటరిగానే టిడిపి వెళ్లే అవకాశం ఉన్నందున గెలుపు అంత సులువు కాదని వైసిపి భావిస్తోంది అందుకే ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగన్ భావిస్తున్నాడు.
అందుకు తగ్గట్టుగానే తీవ్రస్థాయిలో కసరత్తు మొదలు పెట్టాడు.తెలంగాణలో కేసీఆర్ ఏదైతే ఫార్ములాను ఉపయోగించి గెలిచాడో .
సరిగ్గా అదే ఫార్ములా లను ఉపయోగించి ఏపీలో గెలవాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చాడు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అందుకే.సీట్ల కేటాయింపులో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించేందుకు ఇప్పటికే ఒక లిస్టు తయారు చేసుకున్నాడు.
ఎలాగో ఈ వారంలో పాదయాత్ర ముగుస్తుంది.ఈ నెల 8 వ తారీఖున ఇచ్చాపురం లో నిర్వహించే బహిరంగ సభలో పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించి ఏపీలో రాజకీయ సంచలనం సృష్టించాలని జగన్ భావిస్తున్నాడు.
ఇదే గనుక జరిగితే టిడిపి కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటించాల్సి వస్తుంది.తెలంగాణలో కేసీఆర్ ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించే ముందు చాలామంది భయపెట్టారు.
ముందస్తుగా అభ్యర్థులను ప్రకటిస్తే టిక్కెట్లు దక్కని వారు అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీస్తాయని ఇది పెద్ద తలనొప్పి అని కేసీఆర్ కు సూచించారు.
అయినా కేసీఆర్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు.ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి పెద్ద సాహసమే చేశాడు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ కేసీఆర్ భావించినట్టు అసంతృప్తులు పెద్ద పార్టీకి నష్టం చేయలేకపోయారు.
ఈ లోపుగానే పార్టీలో ట్రబుల్ ట్రబుల్ షూటర్ లను రంగంలోకి దింపి వారిని బుజ్జగించి పార్టీ కోసం పని చేసేలా కేసీఆర్ చాలా తెలివిగా వ్యవహరించారు.
కానీ ఏపీలో ముందస్తు ఎన్నికలు లేకపోయినా .కాస్త ముందస్తుగానే జగన్ అన్నిరకాలుగా సిద్ధం అయిపోతున్నాడు.
ప్రజాసంకల్పయాత్రలో పరిస్థితులను నేరుగా చూసిన జగన్ అప్పటికప్పుడు చక్కదిద్దారు.అవసరమైన చోట పార్టీ నియోజకవర్గ కన్వీనర్లను మార్చడంలోనూ ఏమాత్రం వెనకాడలేదు.
ఎమ్మెల్యేలు లేని చోట ఇంచార్జిలను నియమించారు.నియోజకవర్గాల వారీగా తెప్పించుకున్న రిపోర్టులతో అభ్యర్థులు ఎవరనే విషయంపై ఇప్పటికే ఒక లిస్ట్ తయారు చేసేసుకున్నాడు.
ఇక ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించినా.పెద్దగా అసంతృప్తులు ఉండకపోవచ్చు అనేది జగన్ భావన.
ఎందుకంటే ఇప్పుడు జగన్ ప్రకటించే లిస్ట్ లో దాదాపు అంతా ఊహించిన అభ్యర్థుల పేర్లే ఉండే అవకాశం ఉండడంతో పెద్దగా ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు .
డాన్స్ మూవ్స్ తో మైఖేల్ జాక్సన్ నే మించిపోయాడుగా! వైరల్ వీడియో