వివేకా హత్య విషయంలో మళ్లీ అదే తప్పు చేస్తున్న వైసీపీ.. ఈ సమయంలో అవసరమా?
TeluguStop.com
2024 ఎన్నికలు టీడీపీ ఎంత కీలకమో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి( YCP ) కూడా అంతే కీలకమని చెప్పవచ్చు.
ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్( Jagan ) బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు.
అయితే వివేకా( YS Viveka ) హత్య కేసు చుట్టూ ఏపీ రాజకీయాలు జరుగుతుండటం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
వివేకా హత్య గురించి జగన్ స్పందించడం వల్లే అసలు సమస్య మొదలైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రొద్దుటూరులో జరిగిన సిద్ధం బహిరంగ సభలో వివేకానందరెడ్డిని చంపిన వాళ్లకు, దేవుడికి, జిల్లా ప్రజలకు హత్య ఎవరు చేశారో తెలుసని జగన్ అన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం చెల్లెళ్లను ఉసిగొల్పుతున్నారని ఆయన వెల్లడించారు.సునీత,( Suneetha ) షర్మిల( Sharmila ) జగన్ కామెంట్ల గురించి ధీటుగా కౌంటర్లు ఇవ్వడం జరిగింది.
మరోవైపు షర్మిల, సునీతలపై వైసీపీ నేతలు ఒకింత హద్దులు దాటి విమర్శలు చేయడం గమనార్హం.
"""/" /
ఎన్నికల సమయంలో వివేకా హత్య కేసు గురించి ప్రస్తావిస్తూ రాజకీయాలు చేయడం వల్ల కొత్త సమస్యలు వస్తాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
జగన్ ఇకనైనా వివేకా హత్య కేసు ప్రస్తావన లేకుండా రాజకీయాలు చేస్తే మంచిదని సూచనలు వినిపిస్తున్నాయి.
వివేకా కేసు వల్ల వైసీపీకి ఇప్పటికే తీవ్రస్థాయిలో నష్టం కలిగింది.ఆ కేసుకు సంబంధించి చాలా ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం తెలీదు.
"""/" /
ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే వివేకా హత్య కేసు విచారణ మరింత నిదానంగా ముందుకు సాగుతుందని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కడప ఎంపీగా కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆమె ఎన్నికల్లో ఏ మేర ప్రభావం చూపుతారో చూడాలి.
కాంగ్రెస్ ఏపీలో కొన్ని స్థానాలను అయినా సాధిస్తుందని ఎవరూ భావించడం లేదు.వివేకా హత్య కేసుకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి.