YCP Chelluboina Venugopala Krishna : అన్నయ్య పార్టీ మూసేస్తే తమ్ముడు వచ్చాడు..: మంత్రి వేణుగోపాల కృష్ణ

వైసీపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ( YCP Minister Chelluboina Venugopala Krishna ) కీలక వ్యాఖ్యలు చేశారు.

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) పార్టీ పెట్టి తన వల్ల కాదని మూసేశారని అన్నారు.

అన్నయ్య పార్టీ మూసేస్తే 2012 లో మళ్లీ తమ్ముడు వచ్చాడని విమర్శించారు.2014 లో ఓటమిని ఒప్పుకుని పోటీ నుంచి పవన్ కల్యాణ్( Pawan Kalyan ) తప్పుకున్నారని ఎద్దేవా చేశారు.

మళ్లీ ఇప్పుడు పొత్తులతో వస్తున్నారని విమర్శలు చేశారు.కానీ 2014 లో జగన్ ఓడిపోయినా నిలబడ్డారని మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు.

ఈ తరహాలోనే వచ్చే ఎన్నికల్లో ఎంతమంది కలిసొచ్చినా వైసీపీ ప్రభుత్వమే మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తారా స్థాయికి చేరిన మంచు ఫ్యామిలీ గొడవలు… లక్ష్మి ప్రసన్న పోస్ట్ వైరల్!