నాకు అది .. నీకు ఇది ! అప్పుడే పంపకాలు మొదలెట్టేశారే !

రాజకీయ నాయకుల్లో అందరూ ప్రజాసేవే పరమార్ధంగా పనిచేస్తారంటే పొరపాటే.పదవులు, ఆదాయ వనరులు ఇలా అన్నిటిలో లాభపడాలని చూస్తుంటారు.

ఎప్పటి నుంచో ప్రతిపక్షంలోనే కూర్చుని ఖర్చే తప్ప ఆదాయం లేకుండా గెంతుకొచ్చిన వైసీపీ నాయకులు కొందరు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రాబోతోంది అనే సంకేతాలు రావడంతో ఇక తమ హవా చూపించేందుకు సిద్ధమయ్యారు.

ఇప్పటి నుంచే అధికార దర్పం ప్రదర్శిస్తూ అధికార్లను తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అంతే కాదు ప్రధాన ఆదాయ వనరులు ఏమేమి ఉన్నాయి అని తెలుసుకుంటున్నారు.ముఖ్యంగా ఇసుక రీచ్‌ల నుంచి రేషన్ దుకాణాల వరకు అన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు.

ఖాళీగా ఉంటే ఎవరికీ ఏమీ ఇవ్వవొద్దని , ప్రస్తుతానికి టీడీపీ నేతల దగ్గర ఉంటే మాత్రం మే 23 తరువాత వాటిని తమకు అప్పగించేలా అధికారులకు సూచనలు కూడా జారీ చేస్తున్నారు.

ఈ పరిస్థితి ఉపాధిహామీ ఫీల్డ్ అసిసెంట్ల వరకూ ఉంది.రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులంతా ఇదే పనిలో నిమగ్నమయిపోయారట.

ఈ విధంగానే కృష్ణా జిల్లాలో ఓ ఇసుక రీచ్ ను అధికారులు నిలిపివేశారు.

ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు తమకు తెలియకుండా రీచ్ లను ఎవరికీ అప్పగించడానికి వీల్లేదు అంటూ కృష్ణాజిల్లాలోని గనుల శాఖ కార్యాలయానికి వెళ్లి మరీ మౌఖిక ఆదేశాలు జారీ చేశారట.

ఈ విషయం గురించి అదే శాఖలోని ఉన్నతాధికారులకు తెలిసినా తాము చేసేది ఏమీలేదని చేతులెత్తేశారట.

అలాగే గ్రామాలలో ఖాళీగా ఉన్న చౌక డిపోలను ఎవరికీ కేటాయించవద్దని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని భర్తీ చేస్తామంటూ వైసీపీ నేతలు అధికారులకు మండల, డివిజన్ స్థాయిలో ఆదేశాలు ఇస్తున్నారు.

అంగన్ వాడి టీచర్ల నియామకంపై కూడా వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు.అంగన్ వాడీల నియామకాలకు కూడా రాత పరీక్ష ఉందని, మార్కులు కూడా ఉంటాయని, కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారని, అధికారులు చెప్పినప్పటికీ ఖాళీలను మాత్రం తమకు తెలియకుండా భర్తీ చేయవద్దని ఆదేశాలు జారీ చేస్తూ అధికార దర్పాన్ని ప్రదర్శించడం ఇప్పుడు జనాల్లో హాట్ టాపిక్ గా మారింది.

బాబు వల్ల అవ్వాతాతలకు పెన్షన్ కష్టాలు.. పండుటాకులను ఇంతలా ఇబ్బంది పెట్టాలా?