సతీసమేతంగా నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ

కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం: గన్నవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా వల్లభనేని వంశీ మోహన్, గోసుల శివ భరత్ రెడ్డి నామినేషన్ దాఖలు.

ముహూర్త బలం నేపథ్యంలో వల్లభనేని పంకజశ్రీ, వంశీ మోహన్ తొలి సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారు.

తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు నామినేషన్ పత్రాలు అందజేసిన వల్లభనేని పంకజశ్రీ, వంశీ.

వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడుతూ.గన్నవరం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.

ఈనెల 25 న పార్టీ నాయకులతో కార్యకర్తలతో రెండో సెట్ నామినేషన్ చేస్తాను.

దుట్టా రామచంద్రరావుతో నేను కలిసి పని చేస్తా ఆయన నాయకత్వంలోనే నేను పని చేస్తా.

గతంలో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి దుట్టా రామచందర్రావు.రామచంద్రరావు అల్లుడు గోసుల శివభరత్ రెడ్డి కూడా నాతో కలిసి పని చేస్తున్నారు.

నియోజకవర్గంలో అభ్యర్థిగా పది పదిహేను మంది పోటీగా నిలబడతారు.గెలుపు వాటములు అనేవి సహజం అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత ఎవరైనా గెలవాలని అనుకుంటారు.

సజ్జల భార్గవ్ విషయంలో తప్పుడు ప్రచారం.. వైరల్ అవుతున్న ఆ వార్తలు అవాస్తవాలే!