పొత్తు రద్దు చేసుకుంటే పవన్ కళ్యాణ్ కి వైసీపీ బంపర్ ఆఫర్..పవన్ ఒప్పుకుంటాడా?
TeluguStop.com
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతుంది.
ఆయన నిర్ణయం మీదనే రాష్ట్ర రాజకీయాలు మారనున్నాయి.జనసేన పార్టీ మరియు తెలుగు దేశం పార్టీ కలిస్తే కచ్చితంగా వైసీపీ పార్టీ ఓడిపోతుంది అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.
ఇది జరగకూడదు అని జగన్ ప్రభుత్వం కోరుకుంటూ వచ్చేది.కానీ పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే జైలులో ఉన్న నారా చంద్ర బాబు నాయుడు గారిని కలిసి వచ్చే ఎన్నికలలో టీడీపీ మరియు జనసేన పార్టీలు( TDP JanaSena Parties ) కలిసి పోటీ చేస్తాయని అధికారిక ప్రకటన చేసాడు.
అప్పటి నుండి అధికార పార్టీలో గుబులు మొదలైంది.సర్వేలు కూడా పొత్తుకు అనుకూలంగా ఉండేలోపు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పై వైసీపీ నేతలు మాటల దాడులు తీవ్రవంతం చేసారు.
కానీ పవన్ కళ్యాణ్ సమర్థవతంగా వాళ్ళు వేసే నిందలు, వాళ్ళు చేసే మాటల దాడిని తిప్పికొట్టి ముందుకు సాగుతున్నారు.
"""/" /
ఏమి చేసినా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )వెనక్కి తగ్గే ఆలోచన ధోరణి పవన్ కళ్యాణ్ లో లేకపోవడం తో వైసీపీ ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చింది.
5 వేల కోట్ల రూపాయిలు ఇస్తాము, టీడీపీ తో పొత్తు రద్దు చేసుకోమని పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేస్తూ ఒక ఆఫర్ పెట్టింది అట.
వైసీపీ పార్టీ కి చెందిన ఒక సీనియర్ ఎంపీ ఈ మధ్యవర్తిత్వానికి పూనుకున్నాడు అట.
కేవలం డబ్బులు ఇవ్వడమే కాదు, జనసేన ఒంటరిగా పోటీ చేస్తే 30 కి పైగా అసెంబ్లీ స్థానాల్లో గెలిచేలా పరోక్షంగా గ్రౌండ్ లెవెల్ లో సహాయం చేస్తామని, ఇది పార్టీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ కి చెప్పారట.
కానీ పవన్ కళ్యాణ్ ససేమీరా నో చెప్పి పంపించేసాడట.నేను డబ్బు కోసం రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని, ప్రజల శ్రేయ్యస్సు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అని, మీ పార్టీ చాలా అవినీతి చేసింది అంటూ చెప్పుకొచ్చాడు.
"""/" /
మీరు అవినీతి చెయ్యకుండా సుపరిపాలన అందించి ఉంటే నేడు మేము ఇలా రోడ్ల మీదకి వచ్చే వాళ్ళం కాదు, ప్రతీ రంగం లో మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వెనుకబడి ఉంది.
ఈ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మీ పార్టీ మళ్ళీ అధికారం లోకి రావడం ఆంధ్ర ప్రదేశ్ బవితకి ప్రమాదకరం, కాబట్టి నేను తప్పుకునే ప్రసక్తే లేదు అని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) తెగేసి చెప్పాడట.
ఇన్ని రోజులు నా తీరు చూసిన తర్వాత కూడా నన్ను డబ్బుతో కొనాలని చూసారా?, డబ్బే సంపాదించుకోవాలంటే ఈ బురద రాజకీయాల్లోకి రావాలా నేను?, నాకు ఉన్న స్టార్ స్టేటస్ కి వరుసగా సినిమాలు చేస్తే, సంవత్సరానికి 500 కోట్లు సంపాదించగలిగే కెపాసిటీ నాది.
నన్నే కొనాలని చూస్తారా అని ఆ వైసీపీ ఎంపీ ని చెడామడా తిట్టేసి అక్కడి నుండి పంపేసాడట.
గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై రామ్ చరణ్ రియాక్షన్ ఇదే.. గర్వపడేలా చేస్తానంటూ?