వైసీపీ, టీడీపీ ప్రజలను మోసం చేశాయి..: షర్మిల
TeluguStop.com
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మి( AP PCC Chief Sharmila )ల తీవ్రంగా మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు. """/" /
రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును మరింత ఆలస్యం చేస్తున్నారని షర్మిల తెలిపారు.
వైఎస్ కుటుంబం విడిపోవడానికి జగనే కారణమన్నారు.జగన్ నా అన్న వాళ్లందరినీ దూరం చేసుకున్నారని తెలిపారు.
దీనికి సాక్ష్యం దేవుడు, తన అమ్మ, తన కుటుంబమని చెప్పారు.వైసీపీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మూడు వేల కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశానన్న షర్మిల ఎప్పుడు అవసరమని చెబితే అప్పుడు ఏది అడిగితే అది చేశానని తెలిపారు.
వైసీపీ( YCP ) గెలుపు కోసం ఊరు ఊరు తిరిగానని చెప్పారు.అయితే జగన్ ( YS Jagan )ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మారిపోయారని ఆరోపించారు.
వైసీపీ, జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ బీజేపీకి బానిసలని తెలిపారు.వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు ఏపీ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.
స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఫోన్ చేసిన బాలయ్య.. అసలేం జరిగిందంటే?