వైసీపీ వ్యూహకర్త కు డిమాండ్ ఎక్కువయ్యిందే ?

ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే సరైన రాజకీయ వ్యూహం ఉండాలి.ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగా ప్రజల మనసు గెలుచుకునేలా వ్యూహాలు ఉండాలి.

అలా ఒక వ్యూహం ప్రకారం వెళ్తే విజయం తప్పకుండా వరిస్తుంది.అయితే ఇవన్నీ రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

కానీ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తేనే ఇదంతా సాధ్యం అవుతుంది.ప్రస్తుతం ఇటువంటి వ్యూహాలకు పదును పెట్టించుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా కొంతమందిని నియమించుకుంటున్నాయి.

ఆ విధంగానే రాజకీయ వ్యూహాల్లో బాగా ఆరితేరిన ప్రశాంత్ కిషోర్ అనే బీహార్ కు చెందిన వ్యక్తిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగానే నియమించుకుంది.

అతడి వ్యూహాలు, ఎత్తుగడలు చెప్పింది చెప్పినట్టు వైసీపీ అమలు చేసింది.ఫలితంగా ఆ పార్టీకి 175 సీట్లకు గాను 151 సీట్లలో విజయం దక్కింది.

"""/"/ ఇక అప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ కు దేశవ్యాప్తంగా ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది.

ప్రతి పార్టీ ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకునేందుకు తాపత్రయపడుతున్నాయి.ప్రశాంత్ కిషోర్ (పీకే) కు చెందిన ఐ ప్యాక్ సంస్థ ఒప్పందం కోసం పార్టీలన్నీ వేచి చూస్తున్నాయి.

కోట్లాది రూపాయలకు ప్రశాంత్ కిషోర్ కు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయి.త్వరలో జరగనున్న వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీలు ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని ఆరాటపడుతున్నాయి.

ప్రశాంత్ కిషోర్ 2014లో మోదీకి, ఆ తర్వాత బీహార్ లో నితీష్ కుమార్ కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి వారి విజయాల్లో భాగం అయ్యారు.

"""/"/ ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు.

ఆయన సంస్థ ఐప్యాక్ ఇప్పటికే పశ్చిమబెంగాల్ లో తమ వ్యూహాలకు పదునుపెట్టింది.అలాగే మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కూడా ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారు.

తన కుమారుడు ఆధిత్య థాక్రే రాజకీయ భవిష్యత్తుపైనా, త్వరలో జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో పీకే సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారు.

ఇప్పుడు పీకే కోసం తమిళనాడులోని రాజకీయ పార్టీలు కూడా ఎదురుచూపులు చూస్తున్నాయి.తమిళనాడులో 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇప్పటికే కమల్ హాసన్ కు చెందిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పీకేతో ఒప్పందం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతుండగా అధికార అన్నాడీఎంకే కూడా పీకేతో డీల్ కుదుర్చుకున్నట్లు మరో ప్రచారం మొదలయ్యింది.

ఇవన్నీ చూస్తుంటే పీకే డిమాండ్ ఏ మేరకు ఉందో అర్ధం అవుతోంది.

వైరల్ న్యూస్: వాటే టాలెంట్ గురూ.. ఉద్యోగం కోసం కంపెనీకే డబ్బులు ఇస్తానన్న అభ్యర్థి..