మాస్టర్ ప్లాన్ వేసిన యష్మీ.. మణికంఠ ఆటలు బంద్..?

బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టిన నాగమణికంఠ ( Nagamanikantha )ఫస్ట్ నుంచి సింపతీ కార్డు ప్లే చేస్తూ చిరాకెత్తిస్తున్నాడు.

తన భార్య తనని వదిలేసిందంటూ ఏవేవో పాత ట్రాజడీల గురించి చెబుతూ అతను అందరికీ విసుగు తెప్పించాడు.

ముఖ్యంగా హౌస్ లో ఉన్న ఇతర కంటెస్టెంట్లు అతన్ని ఇంటికి పంపించాలని బాగా ట్రై చేశారు.

ప్రతి నామినేషన్స్ లో టార్గెట్ చేశారు.మణికంఠ చాలా డ్రామాలు కూడా చేస్తున్నాడు, వాటిని కూడా ఆడియన్స్ పసిగట్టేశారు.

అదేంటంటే అతను చాలా సానుభూతి పొందుతున్నాడు.అందుకే నామినేషన్స్ లో ఉన్నా సరే కొంతమంది అయ్యో పాపం అంటూ అతనికి ఓట్లు వేసి కాపాడుతున్నారు.

"""/" / మణికంఠ చాలా డేంజర్ అని ఇప్పుడు హౌస్ లో ఉన్న వారందరికీ అర్థమైంది.

అందుకే అతడిని తక్కువ అంచనా వేయకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.మణికంఠ చిన్న విషయాలకే పెద్ద డ్రామా చేస్తాడు.

ప్రతి ఎపిసోడ్‌లో చాలా స్క్రీన్ టైమ్‌ పొందుతున్నాడు.కానీ టాస్కుల విషయానికి వస్తే ఈ కంటెస్టెంట్ చాలా వీక్.

చీఫ్ అయ్యేందుకు కూడా మణికంఠ పనికిరాడు అని చెప్పుకోవచ్చు.కొత్తగా వైల్డ్ కార్డులతో హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్, హరితేజ, టేస్టీ తేజ, రోహిణి ( Avinash, Hariteja, Tasty Teja, Rohini )వంటి కంటెస్టెంట్లు కూడా అతను చీఫ్ కి పనికిరాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

అయితే మణికంఠను ఇలా టార్గెట్ చేస్తూ వెళ్తే ప్రజల్లో ఇంకా సానుభూతి పెరుగుతుందని ఓల్డ్ కంటెస్టెంట్లు అర్థం చేసుకున్నారు.

"""/" / అందుకే కొద్ది రోజులుగా ఈ ఆటగాడిని ఎవరూ టార్గెట్ చేయడం లేదు.

వైల్డ్ కార్డు ఎంట్రీ తర్వాత మణికంఠలో చాలా మార్పు వచ్చింది.మొదట్లో లాగా అతని నిజ స్వరూపం కనిపించడం లేదు.

అందుకే ఓల్డ్ కంటెస్టెంట్‌లు ఒక కొత్త ఎత్తుగడ వేశారు.ఓజీ క్లాన్ అతనికి గేమ్స్ ఆడే ఛాన్స్ ఇచ్చారు.

అంతేకాదు మణికంఠను చీఫ్ చేసేందుకు ఓజీ క్లాన్ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేసి ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచారు.

ఈ మాస్టర్ ప్లాన్ వెనక ఉన్నది మరెవరో కాదు లేడీ కంటెంట్ యష్మి( Yashmi ).

మైండ్ గేమ్ ఆడుతున్న మణికంఠను మైండ్ గేమ్ తోనే చిత్తు చేయాలని ఆమె అతన్ని చీఫ్ చేయాలని భావించింది.

చీఫ్ అయితేనే అతడు బాగా ఎక్స్‌పోజ్ అవుతాడని ఆమె నిఖిల్, మెహబూబ్‌లకు కూడా చెప్పింది.

వారు కూడా ఆమె లాగానే చేశారు.అతనిపై జాలి చూపించే ఇలా చేశారేమో అనుకుంటే పొరపాటే అని సోషల్ మీడియాలో ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు.

మరి వీరి ప్లాన్ సక్సెస్ అవుతుందా మణికంఠ సింపతీ గేమ్ కి ఏక్ పడుతుందా అనేది చూడాలి.

విశ్వంభర మూవీ ప్రొడ్యూసర్లపై వడ్డీ భారం పెరగనుందా.. చిరు సినిమాకే ఎందుకిలా?