ఎలిమినేట్ అయిన యష్మీ గౌడ..12 వారాలకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
TeluguStop.com
Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8( Bigg Boss 8 ) కార్యక్రమం 12 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
ఇక 12వ వారంలో భాగంగా నామినేషన్స్ లో ఉన్న వారిలో కన్నడ బ్యూటీ యశ్మీ గౌడ( Yashmi Gowda ) ఎలిమినేట్ కాబోతున్నారని ఇదివరకే సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇక ఆదివారం ఈమె హౌస్ నుంచి బయటకు అడుగు పెట్టబోతున్నారు.ఇక కన్నడ సీరియల్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న యష్మి తెలుగులో కృష్ణ ముకుందా మురారి సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నారు.
"""/" /
ఇలా ఈ సీరియల్ ద్వారా ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్న ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగు పెట్టారు.
ఇలా మొదటివారం నుంచి ఎంతో చాకచక్యంగా ఆటతీరును కనబరుస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న యష్మీ 12 వారాలపాటు హౌస్ లో కొనసాగారు.
అయితే ఈ వారం ఈమె హౌస్ నుంచి బయటకు రాబోతున్నారని తెలుస్తుంది.ఇలా యష్మి ఎలిమినేట్( Yashmi Eliminate ) కాబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఈమె 12 వారాలకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్( Yashmi Remuneration ) తీసుకుందనే విషయంపై కూడా చర్చలు జరుపుతున్నారు.
"""/" /
ఇలా 12 వారాలపాటు హౌస్ లో కొనసాగిన యష్మీ వారానికి రెండు లక్షల రూపాయలు చొప్పున అగ్రిమెంట్ కుదుర్చుకొని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టినట్టు సమాచారం ఇలా 12 వారాలపాటు ఈమె హౌస్ లో కొనసాగడంతో సుమారు 24 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
నిజానికి బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ఎక్కడ బయట పెట్టకూడదు కనుక సెలబ్రిటీలు ఎవరు కూడా వారి రెమ్యూనరేషన్ విషయాలను బయటపెట్టరు.
కానీ ఈమె సీరియల్ లో నటిస్తూ తనకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ తనకు వారానికి రెండు లక్షల రూపాయలు చొప్పున ఇవ్వటానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది.
2025 లో కూడా మనవాళ్ళు బాలీవుడ్ కు చెమటలు పట్టించడం పక్కానా..?