ఐపీఎల్ లో తొలి సెంచరీ తోనే రికార్డ్ సృష్టించిన యువ ఆటగాడు..!
TeluguStop.com
తాజాగా ఐపీఎల్ లో జరిగిన 1000వ మ్యాచ్ చివరి ఓవర్ వరకు చాలా ఉత్కంఠ భరితంగా సాగింది.
ఆదివారం వాఖండే వేదికగా రాజస్థాన్ - ముంబై( Rajasthan Royals ) మధ్య జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.
రాజస్థాన్ జట్టు మ్యాచ్ ఒడినప్పటికీ ఆ జట్టు ప్లేయర్ యశస్వీ జైస్వాల్( Yashasvi Jaiswal ) కొత్త రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్ 1000వ మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి తొలి సెంచరీ చేసి ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
53 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు.62 బంతుల్లో 8 సిక్సర్లు, 16 ఫోర్ లతో 124 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో స్ట్రైక్ రేట్ 200 గా ఉండడం గమనార్హం.రాజస్థాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా యశస్వీ జైస్వాల్ నిలిచాడు.
"""/" /
గతంలో జోస్ బట్లర్ 64 బంతుల్లో 124 పరుగులు చేశాడు.
కానీ జైస్వాల్ 62 బంతుల్లోనే 124 పరుగులు చేశాడు.అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన అన్ క్యాప్డ్ ఆటగాడిగా జైస్వాల్ రికార్డ్ సృష్టించాడు.
గతంలో 2011లో పంజాబ్ కింగ్స్ జట్టు ప్లేయర్ పాల్ వాల్తాటి చెన్నై జట్టుపై 120 పరుగులు చేసి సాధించిన రికార్డును, ప్రస్తుతం జైస్వాల్ 124 పరుగులతో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
"""/" /
అంతేకాకుండా ముంబై జట్టుపై సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు.
21 ఏళ్లకే జైస్వాల్ 53 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.మరొకవైపు రాజస్థాన్ జట్టు తరఫున కూడా సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడిగా జైస్వాల్ నిలిచాడు.
తరువాత ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రికార్డ్ క్రియేట్ చేశాడు.
"""/" /
ఈ ఐపీఎల్ లో 14 పరుగులు చేసి మొదటి స్థానంలో నిలిచిన వెంకటేష్ అయ్యర్( Venkatesh Iyer ) ను రెండవ స్థానానికి నెట్టి ఇప్పుడు జైస్వాల్ 124 పరుగులతో మొదటి స్థానానికి చేరుకున్నాడు.
వీడియో: ఇది భార్య లేక రాక్షసా.. భర్తను ఇంత ఘోరంగా చితక బాదిందేంటి..