పానీపూరీ అమ్మిన కుర్రాడు కోటీశ్వరుడు అయ్యాడు... ఐపీఎల్ మాయ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.దేశవాళీ క్రికెట్ లో భాగా రాణిస్తే ఇక వారికి తిరుగుండదు.

ఐపీఎల్ లో ఫ్రాంచైజీలు కోట్లు పెట్టి వారిని కొనుక్కోవడానికి ముందుకొస్తాయి.ఇక ఐపీఎల్ ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకి చెందిన పిల్లలు కూడా క్రికెట్ లో రాణించి కోటీశ్వరులు అయ్యారు.

అలాంటి జాబితాలో చాలా మంది ఉంటారు.ఇప్పుడు తాజాగా జరుగుతున్నా ఐపీఎల్ 2020 ఆక్షన్ లో పానీపూరీలు అమ్ముకొని క్రికెట్ నేర్చుకున్న కుర్రాడు కోటీశ్వరుడు అయ్యాడు.

అతనే యూపీ యువ హీరో యశస్వి జైస్వాల్.11 ఏళ్ల వయసులో క్రికెట్ ని కెరియర్ గా ఎంచుకొని తన సొంత ఊరుని, కుటుంబాన్ని వదిలి ముంబై వచ్చిన యశస్వి రోడ్లు మీద, క్రికెట్ మైదానం బయట పాడుకుంటూ చిన్న చిన్న పనులు చేస్తూ పోట్టపోసుకుంటూ ఎలా అయిన క్రికెట్ నేర్చుకోవాలనే కసితో ఉండేవాడు.

ఉండడానికి చోటు లేక ఓ టెంట్లోనే మూడేళ్లు గడిపాడు.ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో బతుకుదెరువు కోసం అనేక పనులు చేసాడు.

ఆజాద్ మైదానం చుట్టూ పానీపూరి అమ్మేవాడు.ఇక అతనిలో కసి చూసిన స్థానిక కోచ్ తన దగ్గర పెట్టుకొని అతన్ని ప్రోత్సహించడంతో ఇక వెనుతిరిగి చూసుకునే అవకాశం లేకుండా సత్తా చాటడం మొదలెట్టాడు.

తన సామర్ధ్యంతో అండర్ 19 జట్టుకి ఎంపికైన ఆసియా సీరిస్ లో ప్లేయర్ అఫ్ ది టోర్నీగా నిలిచాడు.

తరువాత యూపీ తరుపున విజయ్ హజారే ట్రోపీలో రాణించడంతో అతని మీద ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి పడింది.

ఈ నేపధ్యంలో యశస్వి జైస్వాల్‌ను రాజస్థాన్ జట్టు కొనుకోలు చేసింది.యశస్వి జైస్వాల్‌ను దక్కించుకునేందుకు పలు జట్లు పోటీ పడగా చివరికి రాజస్థాన్ రాయల్స్ 2.

40 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

పిల్లల కోసం అమెరికన్ తల్లి చేసే ఇండియన్ వంటలు చూస్తే నోరూరిపోతుంది!