అక్కడ ఇంకా కేజీఎఫ్ 2 ఆడుతుందట.. ఎంత రాబడుతుందో తెలుసా?

యశ్‌ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్‌ 1 సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే.

అదే స్థాయిలో కేజీఎఫ్ 2 కూడా విజయాన్ని సొంతం చేసుకుంటుందని చాలా మంది అనుకున్నారు.

కొందరు మాత్రం అప్పుడు కేజీఎఫ్‌ ఏదో లక్కీగా సక్సెస్ అయ్యింది.కాని ఇప్పుడు అంత సీన్ లేదు.

కన్నడ వరకు ఆడితే గొప్ప విషయం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాని అనూహ్యంగా కేజీఎఫ్ 2 సినిమా కన్నడంలో ఆడిన దానికి బయట మూడు నాలుగు రెట్లు ఎక్కుగా ఆడి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

రాజమౌళి సినిమా ఆర్‌ ఆర్‌ ఆర్‌ ను సైతం బీట్ చేసింది.అంతే కాకుండా హిందీ వర్షన్‌ ఏకంగా దంగల్ ను బీట్‌ చేసింది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఇంతటి వసూళ్లు సాధించిన కేజీఎఫ్ 2 ను ఇటీవలే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

ఓటీటీ ద్వారా వచ్చింది కనుక ఇక థియేటర్లకు ఎవరు వెళ్లరు అనుకుంటే పొరపాటు అవుతుంది.

కేజీఎఫ్ 2 ఇంకా కూడా అద్బుతమైన వసూళ్లను రాబడుతూ అన్ని రకాలుగా నిర్మాతలకు లాభాలను తెచ్చి పెడుతోంది.

ఉత్తర భారతంలోని రెండు మూడు రాష్ట్రాల్లో ఇంకా కేజీఎఫ్ 2 మాస్ ఏరియాల్లో.

సింగిల్ స్క్రీన్‌ థియేటర్లలో ఆడుతుందట.ఆ సినిమా థియేటర్ల నుండి ప్రతి రోజు 10 లక్షలకు పైగా షేర్‌ వస్తుందని అంటున్నారు.

ఇన్ని రోజుల తర్వాత ఒక సినిమా ఆడటం గొప్ప విషయం.అలాంటిది రోజు పది లక్షల షేర్‌ అంటే మామూలు విషయం కాదు.

నెట్‌ గ్రాస్ వసూళ్లు ఎన్ని ఉండి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. కేజీఎఫ్ 2 తర్వాత యశ్‌ మరియు ప్రశాంత్‌ నీల్ లు పాన్‌ ఇండియా స్టార్స్ గా మారి పోయారు.

ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వారితో వర్క్‌ చేయడం కోసం ఎదురు చూస్తున్నామంటున్నారు.

బన్నీ టూ రొమాంటిక్.. ఎవరూ లేకపోతే భార్యను అలా పిలుస్తారా?