'కెజిఎఫ్' ప్రీ రిలీజ్ బిజినెస్ తెలిస్తే షాక్ అవుతారు.. తెలుగులో రికార్డ్ స్థాయిలో బిజినెస్..
TeluguStop.com
కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ సినిమా కన్నడ రికార్డులు అన్ని తిరగరాసింది.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ సినిమా కేజీఎఫ్.
ఈ సినిమా అపాపిట్లో సంచలన విజయం అనే చెప్పాలి.ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఇంతటి ఘానా విజయం సాధించడంతో నీల్ సెకండ్ పార్ట్ కూడా తీసాడు.
కేజీఎఫ్ సినిమాలో యష్ హీరోగా నటించాడు.ఈ సినీరంతో ఈయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
రాఖీ బాయ్ గా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించు కున్నాడు యష్.
ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్ కూడా భారీ స్థాయిలో నిర్మించారు.
ఫస్ట్ పార్ట్ 100 కోట్ల లోపే బిజినెస్ చేసింది.అయితే ఇప్పుడు రెండవ పార్ట్ మాత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసిందో తెలిసి అందరు షాక్ అవుతున్నారు.
2021లోనే కెజిఎఫ్ పార్ట్ 2 రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు ఆకాశానికి తాకింది.
ఈ లెక్కలు చూసి అందరు షాక్ అవుతున్నారు. """/" /
నిర్మాతలు చెబుతున్న రేట్స్ విన్న బయ్యర్స్ కళ్ళు తేలేస్తున్నారట.
కొద్దిగా ఎక్కువుగానే వీరు చెబుతున్నారని వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా తెలుగులో భారీ రేట్ చెప్పారట.
70 కోట్ల మేరకు చెప్పిన దిల్ రాజు అంత పెద్ద మొత్తం అంటే ఎక్కువ అని అనుకున్నారు.
కానీ ఈ సినిమాపై ఉన్న అంచనాలతో ఈ సినిమాకు 66 కోట్లకు దిల్ రాజు హక్కులను సొంతం చేసుకున్నాడు.
తొలిభాగం కేవలం 5 కోట్లు మాత్రమే అమ్ముడైంది అలాంటిది రెండవ భాగం ఏకంగా 240 కోట్ల మేరకు అమ్ముడైంది.
కన్నడలో 100 కోట్ల సోలో బిజినెస్ జరుగుతుంది. """/" /
తమిళంలో 30 కోట్ల వరకు బిజినెస్ చేయగా.
ఓవర్సీస్ లో 80 కోట్ల వరకు కోట్ చేస్తున్నారని తెలుస్తుంది.ఎలా చూసుకున్న కూడా అన్ని భాషల్లో కలిసి కేజీఎఫ్ ఏకంగా 20 కోట్లు ప్ర రిలీజ్ బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మరి ఈ సినిమా ఎంత రాబడుతుందో చూద్దాం.మరి ఇంత వసూలు చేయాలంటే సినిమా 300 గ్రాస్ షేర్ వసూలు చేయాల్సిందే అని లెక్కలు చెబుతున్నాయి.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14 రిలీజ్ కానుంది.
ప్రేమ వ్యవహారం విషాదాంతం..యువకుడి ఆత్మహత్య