మా తెలుగు హీరోలను చూసి నేర్చుకో.. యశ్‌ పై నెటిజన్స్ ట్రోల్స్‌

కన్నడ హీరో యశ్‌( Hero Yash ) కేజీఎఫ్‌ తో పాన్ ఇండియా స్టార్‌ హీరో గా మారాడు.

అంతకు ముందు యశ్ అంటే కనీసం తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసే వాడు కాదు.

పాన్ ఇండియా రేంజ్ లో కేజీఎఫ్ మరియు కేజీఎఫ్ 2 సినిమా లు వందల కోట్ల వసూళ్లు నమోదు చేశాయి.

ముఖ్యంగా కేజీఎఫ్ 2 సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేయడం ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యం ను కలిగించింది.

దాంతో యశ్‌ ముందు ముందు వంద కోట్ల పారితోషికం తీసుకునే హీరోగా నిలవడం ఖాయం అంటూ ప్రచారం జరిగింది.

ప్రభాస్( Prabhas ) బాహుబలి తో వచ్చిన క్రేజ్ ను క్యాష్‌ చేసుకునేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమా లు చేశాడు.

ఇంకా చేస్తూనే ఉన్నాడు.ఇతర తెలుగు హీరో లు కూడా ఒక్క హిట్‌ పడితే చాలు మూడు నాలుగు సినిమాలను కమిట్ అవుతారు.

"""/" / కనుక ఆ విధంగానే యశ్‌ కూడా సినిమా లను ఎంపిక చేసుకోవాలంటూ చాలా మంది కోరుతున్నారు.

కానీ యశ్ మాత్రం కేజీఎఫ్‌ 2( KGF 2 ) సినిమా విడుదల అయి ఇన్నాళ్లు అయినా కూడా కొత్త సినిమా అప్డేట్‌ ఇవ్వడం లేదు.

ఇంత ఆలస్యం చేసి ఒప్పుకున్న సినిమా తో మళ్లీ వెయ్యి కోట్లు వసూళ్లు సాధిస్తాడా అంటే కచ్చితంగా సాధ్యం కాదు.

కనుక యశ్‌ ఏదో ఒక సినిమాకు ఓకే చెప్పాలి అంటూ చాలా మంది కోరుకుంటున్నారు.

అదే కనుక యశ్ చేస్తే వెంటనే కొత్త సినిమా ను చేసి తెలుగు హీరోల మాదిరిగా తన మార్కెట్‌ ను పెంచుకోవాలని సలహా ఇస్తున్నారు.

యశ్‌ కేజీఎఫ్ 2 సినిమా తర్వాత వెంటనే కొత్త సినిమా ను కమిట్‌ అవ్వాలి అనుకున్నా కూడా తాను కోరుకున్న కథ లభించడం లేదు అంటూ సన్నిహితుల వద్ద అంటున్నాడట.

అసలు విషయం ఏంటి అనేది ఆ కన్నడ స్టార్ కే తెలియాలి.

అందుకే ఫస్ట్ హాఫ్ స్లోగా తీసాం.. ట్రోల్స్ పై నాగ్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు!