Yasangi Grain : ప్రణాళికాబద్ధంగా యాసంగి ధాన్యం కోనుగోలు చేయాలి…… రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
TeluguStop.com
యాసంగి 2023-24 ధాన్యాన్ని ప్రణాళిక బద్ధంగా మద్దతు ధర పై కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్ లోని డాక్టర్ బి.
ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి ధాన్యం కొనుగోలు, వేసవి త్రాగునీటి సరఫరా ప్రణాళిక పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ యాసంగి పంట కోతలకు వస్తున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో వరి కోతల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరిస్తూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంటుందని, అధికారులు మాత్రమే ధాన్యం కొనుగోలు( Grain ) కేంద్రాల ప్రారంభోత్సవం చేయాలని, ఎక్కడ ఎటువంటి ప్రజాప్రతినిధులు పాల్గోనవద్దని అన్నారు.
యాసంగి పంట కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా 7149 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంటుందని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సరఫరా ,టెంట్లు వంటి ఏర్పాట్లు చేయాలని సి ఎస్ అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల( Grain Purchase Centers ) వద్ద ప్యాడ్ క్లీనర్లు, తేమ యంత్రాలు, వెయింగ్ యంత్రాలు, టార్ఫాలిన్ల, గన్ని బ్యాగులు సన్నద్ధం చేసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు, సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్లులకు రవాణా చేసేందుకు అవసరమైన వాహనాలు సిద్ధం చేసుకోవాలని అన్నారు.
చివరి గింజ వరకు నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధరపై ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎక్కడ తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అవసరం లేదనే సందేశం రైతుల వద్దకు వెళ్లేలా అవగాహన కల్పించాలని, భారత ఆహార సంస్థ నిర్దేశించిన ధాన్యం నాణ్యత ప్రమాణాలు, తేమ శాతం పై విస్తృత అవగాహన కల్పించాలని, రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకొని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి సంబంధిత మిల్లర్లకు కేటాయించాలని, రైస్ మిల్లు( Rice Mill ) వద్ద ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కోత రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైస్ మిల్లర్ల వద్ద హమాలీల కొరత రాకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం రైతులు ధాన్యాన్ని తీసుకుని వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలో వరి సాగు చేస్తున్న రైతులకు సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ట్యాగింగ్ చేయాలని, ప్రణాళిక బద్ధంగా కొనుగోలు కేంద్రం వద్దకు రైతు ధాన్యం తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వానాకాలం 2023-24 కు సంబంధించి సీఎంఆర్ రా రైస్ డెలివరీ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, భారత ఆహార సంస్థ నిర్దేశించిన సమయానికి రైస్ డెలివరీ చేసే విధంగా ప్రతి జిల్లాలో రైస్ మిల్లుల పనితీరును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని, ప్రతిరోజు రైస్ మిల్లులు పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిచేలా చూడాలని, సిఎంఆర్ రా రైస్ డెలివరీ పై కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని సిఎస్ పేర్కొన్నారు.
వేసవి కాలంలో త్రాగునీటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ త్రాగునీటి సరఫరాలో వచ్చే చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని , ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డు స్థాయిలో త్రాగునీటి సరఫరాకు ప్రణాళికలు తయారు చేసుకోవాలని, త్రాగునీటి పైప్ లైన్ లీకేజీలు( Drinking Pipeline Leakages ) అరికట్టాలని తెలిపారు.
సమ్మర్ యాక్షన్ ప్లాన్, ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సూచించారు.ఎక్కడా ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ ల పరిధి లో తాగు నీటి సరఫరాను నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఏమైనా ఇబ్బందులు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.జిల్లాలో త్రాగునీటి అవసరాల మేరకు బోరు బావులను, పాత త్రాగునీటి సరఫరా మోటార్లను పునరుద్ధరించాలని, త్రాగునీటి సరఫరా నిమిత్తం అవసరమైన పనులను వెంటనే చేపట్టాలని , ఎక్కడ నిధులకు ఆటంకం లేనందున అత్యంత ప్రాధాన్యతతో త్రాగునీటి సరఫరా పనులు పూర్తి చేయాలని అన్నారు.
గ్రామీణ నీటి సరఫరా శాఖ పరిధిలో ఉన్న త్రాగునీటి వ్యవస్థను ఒకసారి పరిశీలించి అవసరమైన మరమ్మత్తులు పూర్తిచేయాలని తెలిపారు.
ప్రతి మున్సిపాలిటీలో చివరి వార్డ్, గ్రామాలలో చివరి ప్రాంతం వరకు త్రాగునీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, సరఫరా లో అంతరాయం ఏర్పడితే ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నయ ఏర్పాట్లు సత్వరమే చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యానాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా మేనేజర్ జితేంద్ర ప్రసాద్, డీఆర్డీఓ శేషాద్రి, డీపీఓ వీర బుచ్చయ్య, డీఏఓ భాస్కర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
‘పుష్ప 2’ ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి లైన్ క్లియర్ అయిందా..?