యండమూరి తన తాజా సినిమా గురించి ఏం చెప్పాడో తెలుసా?

తెలుగు నాట కథా రచయితగా, నవలా రచయితగా మంచి పేరు పొందిన వ్యక్తి యండమూరి వీరేంద్రనాథ్.

ఆయన రాసిన ఎన్నో పుస్తకాలు తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి.అప్పట్లో యండమూరికి ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.

ఇప్పటి సినిమా హీరోలతో సమానంగా క్రేజ్ ఉండేది.కొంత కాలం తర్వాత ఆయన రాసిని చాలా నవలలు సినిమాలుగా రూపొందాయి.

అప్పుడు కూడా ఈయన గురించి జనాల్లో బాగా చర్చ జరిగేది.ఇటు సినిమా రచయితగా.

అటు నవలా రచయితగా మంచి పేరు పొందాడు.ప్రస్తుతం ఆయన పుస్తకాలు చదివే వారి సంఖ్య తక్కువే అయినా.

ఆయన తెలియని వారు ఉండరు అని చెప్పుకోవచ్చు.యండమూరి కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు.

తాజాగా అతడు ఆమె ప్రియుడు అనే సినిమాను తెరకెక్కించాడు.యండమూరి రాసిన నవలల్లో అతడు ఆమె ప్రియుడు అనే నవల మంచి జనాదరణ పొందింది.

అప్పట్లో ఈ నవలను చాలా మంది ఇష్టపడే వారు.అదే నవల పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు యండమూరి.

ఈ సినిమా ఈ నెల 4న జనాల ముందుకు రానుంది.ఈనేపథ్యంలో ఈ సినిమా గురించి పలు విషయాలు వెల్లడించాడు యండమూరి.

"""/"/ తాను ఇప్పటి వరకు 35 సినిమాలకు రచయితగా పని చేసినట్లు చెప్పాడు.

ఏ కథలోనూ హీరో, హీరోయిన్ ను టీజ్ చేయడం అనేది ఉండదని చెప్పాడు.

అంతేకాదు.తన కథల్లో హీరోయిన్లు చాలా తెలివైన వారని చెప్పాడు.

తాను దర్శకత్వం చేసే సమయంలో అదే ఆలోచిస్తాను తప్ప.మరో ఆలోచన ఉండదన్నాడు.

సత్యజిత్ రే, మృణాల్ సేన్ లాంటి సినిమాలు చేయాలన్నదే తన ఆలోచన అన్నాడు.

అలా తాను చేసిన స్టూవర్టు పోలీస్ స్టేషన్ కూడా జనాలకు నచ్చకపోవడంతో చాలా కాలం సైలెంట్ గా ఉన్నట్లు వెల్లడించాడు.

ఓటీటీ వచ్చాక తనకు సంబంధించిన ఆడియన్స్ చూస్తారనే నమ్మకం వచ్చినట్లు చెప్పాడు.అందువల్లే మూడు నెలల్లో రెండు సినిమాలను ప్రాక్టీస్ చేసినట్లు వెల్లడించాడు.

ప్రేమకు సంబంధించిన కథతో తన తాజా సినిమా తెరకెక్కినట్లు వెల్లడించాడు.

నాని తేజ సజ్జ లకు సక్సెస్ లు వస్తున్నాయి…మరి ఆ ఇద్దరు స్టార్ హీరోలకు మాత్రం ఎందుకు ప్లాప్ లు వస్తున్నాయి…